Adah Sharma : 3 రోజుల్లో 150 మిలియన్ వాచ్ అవర్స్.. ఓటీటీలో ది కేరళ స్టోరీ మాస్ ర్యాంపేజ్..!

Adah Sharma లాస్ట్ ఇయర్ రిలీజైన వివాదాస్పద సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ. సినిమా రిలీజైన టైం లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా మీద ఏర్పడిన వివాదాలే ఆ సినిమాకు

Published By: HashtagU Telugu Desk
Adah Sharma The Kerala Story Record Watch Hours In Zee 5 Ott Release

Adah Sharma The Kerala Story Record Watch Hours In Zee 5 Ott Release

Adah Sharma లాస్ట్ ఇయర్ రిలీజైన వివాదాస్పద సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ. సినిమా రిలీజైన టైం లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా మీద ఏర్పడిన వివాదాలే ఆ సినిమాకు భారీ ప్రమోషన్ గా మారి సినిమాను సూపర్ హిట్ చేశాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టిన ది కేరళ స్టోరీ సినిమా కొన్నాళ్లుగా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు సినిమా థియేట్రికల్ రిలీజై ఏడాది అవుతున్నా సినిమా డిజిటల్ రిలీజ్ నోచుకోలేదు. ఫైనల్ గా ఫిబ్రవరి 16న ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీలో రిలీజైంది.

జీ 5 లో రిలీజైన ఈ సినిమా 3 రోజుల్లోనే 150 మిలియన్ వాచ్ అవర్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. సుదిప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అదా శర్మ లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ అంతా సినిమా ఓటీటీ రిలీజ్ అవ్వడంతో తెగ చూసేస్తున్నారు. ఈ దెబ్బతో జీ 5 ఓటీటీ సబ్ స్క్రిప్షన్ సంఖ్య కూడా పెరిగేలా ఉంది.

అదా శర్మ ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రసతుతం ఆమె మరో సాహసోపేత సినిమాలో చేస్తుందని తెలుస్తుంది. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. అదా శర్మ ది కేరళ స్టోరీ ఓటీటీ వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి డిస్కషన్స్ చేస్తున్నారు.

Also Read : Viswak Sen : ఆ ఇష్యూ వల్ల నేనే ఎక్కువ నష్టపోయా.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో అయితే అలా ప్రెస్ మీట్ పెట్టేవారా..?

  Last Updated: 20 Feb 2024, 08:20 AM IST