Sreeleela: ఇకపై తమిళ సినిమాలు కూడా చేస్తాను.. హీరోయిన్ శ్రీలీలా కామెంట్స్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 05:14 PM IST

టాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ శ్రీలీల పేరు కూడా ఒకటి. ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఎంబిబిఎస్ కోర్సు చేస్తోంది.

మొదటి రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీలీల. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెలను కొల్లగొట్టేసింది.అందం, అభినయంతో పాటు తన ఎనర్జీతో ప్రేక్షకులను కవ్వించింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో కూడా మంచి సక్సెస్ను అందుకుంది శ్రీ లీల. ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. శ్రీలీల కన్నడ, తెలుగులో సినిమాలు చేసింది. తాజాగా తమిళ్ లో కూడా చేస్తా అంటుంది.

శ్రీలీలకు సోషల్ మీడియాలో, బయట అభిమానులు చాలానే ఉన్నారు. తెలుగు, కన్నడలోనే కాక బయట కూడా అభిమానులు ఉన్నారు. ఇటీవల శ్రీలీల చెన్నై దగ్గర్లోని ఒక మెడికల్ కాలేజీ కల్చరల్ ఈవెంట్ కి వెళ్ళింది. అక్కడి స్టూడెంట్స్ శ్రీలీలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. శ్రీలీల కోసం అరుపులు, విజిల్స్ తో హడావుడి చేసారు. దీంతో శ్రీలీల కూడా ఆశ్చర్యపోయింది. శ్రీలీల పేరు, ఫోటోలు పట్టుకొని జనాల మధ్యలో నుంచి చూపించారు. ఇవన్నీ చూసి తమిళనాడులో కూడా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని షాక్ అయింది శ్రీలీల. అభిమానులను చూసి ఆశ్చర్యపోయిన ఆమె స్టేజిపై మాట్లాడుతూ.. నేను చాలా హ్యాపీగా ఉన్నాను.

ఇన్నాళ్లు నాకో డౌట్ ఉండేది. నాకు తమిళ్ రాదు, తమిళ్ లో సినిమాలు చేయలేదు. ఇక్కడ నేనెవరికీ తెలుస్తాను అనుకున్నాను. నన్ను గెస్ట్ గా పిలిచినప్పుడు నేనెలా వస్తాను అనుకున్నాను. కానీ ఇక్కడ మీ ప్రేమ చూసాక చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని చూసాక ఇక్కడికి వచ్చి తమిళ్ సినిమా చేయాలి అనిపిస్తుంది. మెడికల్ కాలేజీలో ఇంత ఎనర్జీనా? నేను కూడా మెడికల్ స్టూడెంట్ నే. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి తమిళ్ లో చేయడానికి నేను రెడీ అని శ్రీలీలే స్వయంగా చెప్పింది, ఇది విని ఎవరైనా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి మరి.