Shakeela: ఎంతోమందిని ప్రేమించి.. 23 ఏళ్లకే అన్నీ చూసేసాను.. షకీలా కామెంట్స్ వైరల్?

తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది షకీలా. ఎక్కువ శాతం శృంగార

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 06:46 PM IST

తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది షకీలా. ఎక్కువ శాతం శృంగార సన్నివేశాలలో బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో ఈ మనసు శృంగార తారగానే గుర్తు పెట్టుకున్నారు అభిమానులు. ఇకపోతే షకీలా తెలుగు తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరం ఉంటున్న షకీలా ఇటీవలే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు షకీలా. కానీ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

అయితే చాలామంది ఈమెను శృంగార తారగా గుర్తించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం ఈమె ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతో మంది ట్రాన్స్ జెండర్లకు ఈమె జీవితాన్ని ఇచ్చింది. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా ఎమోషనల్ కామెంట్స్ చేసింది.. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. నేను ఏడూ ఎనిమిది మందితో ప్రేమాయణం సాగించాను. కానీ వారు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేరు పైగా నా ఆస్థిని దోచేశారు. నేను బీ గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే.

అప్పుడు నేను ఎవరికోసమైతే అంతగా కష్టపడ్డానో, అంత సంపాదించానో వాళ్లు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులు ఉంటేనే మనతో ఉంటారు. కానీ ఇప్పుడు నేను తినడానికి లేని పరిస్థితిలో లేను కానీ నాకంటూ ఎవ్వరూ లేరు అని ఎమోషనల్ అయ్యారు షకీలా. అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి అనేది మన చేతిలో ఉండదు. అలాగే నేను 23 ఏళ్లకే అన్ని చూసేశాను.. చిన్న వయసులోనే బాగా సంపాదించాను. 5 కార్లు కొన్ని ఇళ్లు కొన్నాను. అందరిలానే నాకు అనిపిస్తుంది.. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి. పిల్లలు ఉండాలి. అమ్మ అని పిలిచే వాళ్లు ఉండాలి అని ఎమోషనల్ అయ్యారు షకీలా. అలాగే చాలా మందిని ప్రేమించాను కానీ వాళ్లు మోసం చేశారు. మా అమ్మ నాతో ఉండకూడదు అని కండీషన్ పెట్టారు. ఇక నేను ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ను దత్తత తీసుకున్నా అలా పెళ్లి కాకుండానే తల్లిని అయ్యాను వాళ్లకు పెళ్లిళ్లు చేస్తున్నా అని అన్నారు షకీల.