Site icon HashtagU Telugu

Vishal : విశాల్ పెళ్లి చేసుకోబోయే నటి ఎవరో తెలుసా? రజినీకాంత్ కూతురిగా ఫేమ్.. తెలుగులో ఏమేం సినిమాలు చేసిందంటే..

Sai Dhanshika and Vishal Going to Marry

Sai Dhanshika Vishal

Vishal : తమిళ్ హీరో విశాల్ పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా రెండు రోజుల నుంచి విశాల్ నటి సాయి ధన్సికని పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే నిన్న సాయి ధన్సిక మెయిన్ లీడ్ లో నటిస్తున్న యోగిదా సినిమా ట్రైలర్ ఈవెంట్ కి విశాల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో విశాల్, సాయి ధన్సిక ఇద్దరూ స్వయంగా మేము ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రకటించారు.

దీంతో అంతా ఆశ్చర్యపోయారు. రూమర్స్ కాస్త నిజం అయ్యాయి అని విశాల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విశాల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో సాయి ధన్సిక ఎవరు అని వెతకడం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు.

సాయి ధన్సిక 2006లో తమిళ్ లో మనతోడు మజికలం అనే సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 2016 లో కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురుగా నటించింది. ఆ సినిమాతో ఒక్కసారిగా సాయి ధన్సిక స్టార్ డమ్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూతురి పాత్రలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది.

ఆ తర్వాత మరిన్ని తమిళ్ సినిమాలు చేసింది. మధ్యలో మలయాళం, కన్నడ సినిమాలు కూడా చేసింది. తెలుగులో షికారు అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాతో మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాగానే మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో అంతిమ తీర్పు, దక్షిణ.. లాంటి సినిమాలు మెయిన్ లీడ్ లో చేసినా పరాజయం పాలయ్యాయి. త్వరలో యోగిదా అనే తమిళ్ సినిమాతో రాబోతుంది సాయి ధన్సిక. ఇక నిన్న ఈవెంట్లో విశాల్, సాయి ధన్సిక క్లోజ్ గా ఉండటం, స్టేజిపై విశాల్ ధన్సికని దగ్గరకు తీసుకొని తలపై ముద్దు పెట్టుకోవడంతో వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.

 

Also Read : Mahesh : మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మరో వారసుడి ఎంట్రీ?

Exit mobile version