Rambha : రంభ.. ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఆమెను నేటికీ సినీ ప్రియులు మర్చిపోలేదు. రంభ.. అనగానే మనందరి కళ్లెదుట ఆమె అందమైన ముఖ వర్ఛస్సు కదలాడుతుంది. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. రంభ మళ్లీ సినిమాల్లోకి వస్తోందట.
Also Read :Syria Bloodbath: సిరియాలో రక్తపాతం.. అలావైట్ల ఊచకోత.. ఎవరు వారు?
రంభ భర్తకు మాట ఇచ్చా
తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను కీలక వ్యాఖ్యలు చేశారు. రంభ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వెల్లడించారు. రంభ ఇప్పుడు ఆర్థికంగా సెటిల్ అయ్యారని చెప్పారు. రంభ భర్త కూడా పెద్ద వ్యాపారవేత్త అని తెలిపారు. ‘‘ఇటీవలే రంభ భర్త నన్ను కలిశారు. రంభకు మంచి సినిమాలో అవకాశం ఇవ్వండని కోరారు’’ అని కలైపులి ఎస్.థాను చెప్పుకొచ్చారు. ‘‘మంచి మూవీ ఏదైనా ఉంటే, తప్పకుండా చెబుతా అని నేను రంభ భర్తకు మాట ఇచ్చాను’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read :Real Money Gaming: ‘ఆన్‌లైన్ గేమింగ్’కూ ఇక కేవైసీ.. ‘నైతిక నియమావళి’ కూడా!
రాజేంద్ర ప్రసాద్ మూవీతో ఎంట్రీ
- నటి రంభ 1976 జూన్ 5న విజయవాడలో జన్మించారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి.
- రంభకు స్కూల్ డేస్ నుంచే నటన అంటే ఇష్టం.
- ఆమె తొలిసారిగా మలయాళం సినిమా ‘సర్గం’లో నటించారు. అందులో హీరో వినీత్.
- రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్‌లోకి రంభ(Rambha) ఎంటర్ అయ్యారు.
- దేశముదురు, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆమె నటించారు.
- కెనడాలో స్థిరపడిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను 2010 ఏప్రిల్ 8న రంభ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారి పేర్లు లాన్య, సాషా.
- కొంతకాలంగా సినిమాలకు రంభ దూరంగా ఉంటున్నారు.
- పలు టీవీ డ్యాన్స్ షోలకు రంభ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
- చివరిసారి 2008లో వెండితెరపై ఆమె కనిపించారు.