Site icon HashtagU Telugu

Radhika Apte: టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్.. వాళ్లదే ఆదిపత్యం అంటూ?

Mixcollage 17 Feb 2024 09 49 Am 6739

Mixcollage 17 Feb 2024 09 49 Am 6739

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలలో నటించిన రాధిక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తూ అక్కడే సెటిల్ అయింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత లెజెండ్, లయన్ సినిమాల్లో నటించి అలరించింది. ఇటీవల విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.

అయితే నిత్యం ఈ బ్యూటీ ఏదొక విషయంపై వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు లేకపోలేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లేని పోనీ కాంట్రవర్సీలను తెచ్చుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఆమె తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక మాట్లాడుతూ..

నేను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ తెలుగు. ఎందుకంటే ఆ పరిశ్రమ చాలా పితృస్వామికమైనది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పురుషాధిక్యత ఎక్కువగా ఉంది. పురుషులు గుడ్డి జాతీయవాదులు. అక్కడ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అసహనంగా ఉంది. మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. సెట్ లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. అక్కడ నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను. ఏం చెప్పకుండానే ఇష్టమొచ్చినట్లు షూట్ క్యాన్సిల్ చేస్తారు. అక్కడ నా అవసరం కొంతవరకే అని గ్రహించాను అని చెప్పుకొచ్చింది రాధిక. కాగా ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ప్రస్తుతం రాధిక పై టాలీవుడ్ ప్రేక్షకులు మండి పడుతున్నారు.