Site icon HashtagU Telugu

Priyamani : ఖరీదైన బెంజ్ కారు కొన్న ప్రియమణి.. భర్తతో కలిసి..

Actress Priyamani buys Costly Benz Car

Actress Priyamani buys Costly Benz Car

నటి ప్రియమణి(Priyamani) ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి ప్రస్తుతం ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు, పెద్ద సినిమాల్లో కీ రోల్స్, టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే ఆహాలో భామాకలాపం 2 సినిమాతో వచ్చి మెప్పించింది. ప్రస్తుత్తం సినిమాలు, సిరీస్ లు, షోలతో ఫుల్ బిజీగానే ఉంది.

తాజాగా ప్రియమణి ఓ ఖరీదైన బెంజ్ కారు(Benz Car) కొనుగోలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ GLC అనే మోడల్ కారుని ప్రియమణి కొనుక్కుంది. ఈ కారు విలువ దాదాపు 80 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. బెంజ్ కంపెనీ తమ సోషల్ మీడియాలో ప్రియమణి కారు కొనుక్కొని, సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసారు. దీంతో ప్రియమణికి పలువురు అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ప్రియమణితో పాటు తన భర్త ముస్తఫా రాజ్, ప్రియమణి అత్తమ్మ కార్ తీసుకోడానికి వచ్చారు. అక్కడే కేక్ కట్ చేసి కార్ కొన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ముగ్గురూ. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

Also Read : Allu Ayan: షారుక్ ఖాన్ పాటను అద్భుతంగా పాడిన అల్లు అయాన్.. నెట్టింట వీడియో వైరల్?