సంక్రాంతికి విడుదలైన సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ థియేటర్స్ లలో విడుదలైంది. కానీ మొదటి ఆట తోనే మిక్సెడ్ టాక్ రావడం ఇదే క్రమంలో పైరసీ ప్రింట్ రావడం తో సినిమా పై ఎఫెక్ట్ భారీగా పడింది. టాక్ తో పాటు ప్రింట్ కూడా వచ్చేయడం, ఇదే క్రమంలో సంక్రాంతి బరిలో వచ్చిన డాక్ మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సూపర్ హిట్ టాక్ రావడం తో జనాలంతా ఆ సినిమాలే చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో గేమ్ ఛేంజర్ ను పట్టించుకునే నాధుడు కరవయ్యాడు. సినిమా మూడో రోజే చాల థియేటర్స్ లలో గేమ్ ఛేంజర్ లేపేసి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని కేటాయించారు. ఇక ఇప్పుడు చిత్ర నటి నటులు కూడా మెల్లగా సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పకనే చెపుతున్నారు.
Gold Price: లక్ష రూపాయలకు చేరనున్న బంగారం ధర!
రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని తెలిపారు. ‘జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు. అయితే వాటిని పునరావృతం చేయకుండా ఉండటమే కీలకం. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుంది’ అని ఓ షోలో చెప్పుకొచ్చారు. తాజాగా అంజలి(Anjali) కూడా సినిమా ఫలితం పై స్పందించింది. తమిళంలో సంక్రాంతికే రిలీజై సూపర్ హిట్ అయిన తన పాత చిత్రం ‘మదగజ రాజా’ తెలుగులోనూ విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న అంజలికి ‘గేమ్ చేంజర్’ గురించి ప్రశ్న ఎదురైంది. అక్కడ ‘మదగజ రాజా’ బాగా ఆడింది, ఇక్కడ ‘గేమ్ చేంజర్’ కూడా అలాగే ఆడి ఉంటే బాగుండేది కదా అని అడిగితే..గేమ్ చేంజర్ నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా. దాని కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టాను. సినిమా చూసిన వాళ్లందరూ అది మంచి సినిమా అన్నారు. ఎవ్వరూ బాగా లేదని చెప్పలేదు. దాని ఫలితం గురించి మాట్లాడాలంటే ఇంకో ప్రెస్ మీట్, అరగంటకు పైగా సమయం అవసరం. కానీ ఆ సినిమా విషయంలో నేను బాగా హర్ట్ అయ్యాను’’ అంటూ ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ తనను నిరాశకు గురి చేసినట్లు చెప్పకనే చెప్పింది.