Sonu Sood : సోనూ సూద్‌కు పొలిటికల్ ఆఫర్స్ వచ్చాయా ? రాజకీయాల్లోకి రావాలని ఏదైనా పార్టీ అగ్రనేతలు ఆయనకు ఆహ్వానం పలికారా ? సీఎం సీటు లాంటి కీలకమైన పోస్టును కూడా సోనూకు ఆఫర్ చేశారా ? అంటే.. ‘ఔను’ అని స్వయంగా సోనూ సూద్ చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
Also Read :Business Lookback 2024 : దేశం గర్వించే పారిశ్రామిక దిగ్గజాలు.. 2024లో మనకు దూరమైన వేళ..
సోనూ సూద్‌కు(Sonu Sood) చాలా క్రెడిబిలిటీ ఉంది. ఆయనను ప్రజలు రియల్ హీరో అని పిలుస్తున్నారు. ఒకవేళ సోనూ ఏదైనా పొలిటికల్ పార్టీ కండువా కప్పుకుంటే.. కచ్చితంగా దానికి విలువ మరింత పెరుగుతుంది. అందుకే సోనూ సూద్‌కు కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానం పలికాయట. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవివరాలను స్వయంగా సోనూ వెల్లడించారు.
Also Read :Employee Theft : శాలరీ రూ.13వేలు.. బీఎండబ్ల్యూ కారు కొనేశాడు.. గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్టుగా 4 బీహెచ్‌కే ఫ్లాట్
‘‘కొన్ని రాజకీయ పార్టీలు నాకు ఆఫర్లు ఇచ్చాయి. నేను వాళ్లను ఎప్పుడూ సంప్రదించలేదు. అయినా వాళ్లే నన్ను సంప్రదించారు. ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చారు’’ అని సోనూ సూద్ చెప్పుకొచ్చారు. ‘‘ఒక రాజకీయ పార్టీ వాళ్లయితే నా కోసం చాలా పెద్ద ఆఫర్లు ఇచ్చారు. నేను రాను అని చెబితే.. అవసరమైతే మిమ్మల్నే సీఎం చేస్తామన్నారు’’ అని ఆయన తెలిపారు. ‘‘ఒకవేళ సీఎం పోస్టు వీలు కాకపోతే డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామన్నారు. ఇంకో పార్టీ వాళ్లు వచ్చి రాజ్యసభ సీటు ఇస్తామన్నారు’’ అని సోనూ సూద్ చెప్పారు. ‘‘ఆ పొలిటికల్ ఆఫర్లన్నీ నాకు నచ్చలేదు. ఎందుకంటే.. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన నాకు లేదు. పాలిటిక్స్‌లోకి వెళితే నేను స్వేచ్ఛను కోల్పోతాను. స్వేచ్ఛగా సామాజిక సేవా కార్యక్రమాలు చేసే అవకాశాన్ని కోల్పోతాను. ప్రజలకు దూరం అవుతాను. నేను ప్రజలకు దూరంగా ఉండలేను’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘అంత పెద్ద పొలిటికల్ ఆఫర్లు వస్తాయని నేను కూడా ఊహించలేదు. అయితే నా గురించి అంత గొప్పగా ఆలోచించినందుకు వాళ్లందరికీ రుణపడి ఉంటాను’’ అని సోనూ సూద్ తెలిపారు. ‘‘రాజకీయాల్లోకి ఎవరూ ఊరికే ఎంటర్ కారు. కొంతమంది రాజకీయాల నుంచి డబ్బును కోరుకుంటారు. వ్యాపార ప్రయోజనాలను కోరుకుంటారు. ఇంకొందరు అధికారం కోసం పాకులాడుతారు. చాలా తక్కువ మంది ప్రజాసేవ కోసం రాజకీయాలను వాడుతారు. ఈవిషయంలో ఇప్పటికే నేనున్నా. ప్రజలకు సేవ చేస్తున్నా’’ అని ఆయన వివరించారు.