150 Years Sarathkumar : 150 ఏళ్లు బతుకుతా.. లైఫ్ సీక్రెట్ తెలిసిపోయింది

ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్ సంచలన ప్రకటన చేశారు.  "నేను 150 ఏళ్లు జీవిస్తా" (150 Years Sarathkumar) అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా పనిచేసిన శరత్‌కుమార్ చేసిన ఈ ప్రకటనపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది. 

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 04:15 PM IST

150 Years Sarathkumar : ప్రముఖ తమిళ నటుడు శరత్‌కుమార్ సంచలన ప్రకటన చేశారు. 

“నేను 150 ఏళ్లు జీవిస్తా” అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.. 

రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా పనిచేసిన శరత్‌కుమార్ చేసిన ఈ ప్రకటనపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది. 

శరత్‌కుమార్ కు తమిళనాడులో ఒక రాజకీయ పార్టీ కూడా ఉంది. దానిపేరు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK). ఇక మూవీ ఇండస్ట్రీలో ఆయన ఎంత ఫేమసో వేరేగా చెప్పనక్కర లేదు.  ఆయన తన కెరీర్ లో అనేక భాషల మూవీస్ లో నటించారు. హీరో క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ కూడా చేశారు. ఇదే సమయంలో శరత్‌కుమార్ పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గానే ఉంటారు. ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన ఒక రాజకీయ సమావేశంలో ఆర్‌ శరత్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Also read : Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!

“2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ముఖ్యమంత్రిని చేస్తే.. 150 ఏళ్లు బతుకుతాను” అని శరత్‌కుమార్ ప్రకటించారు. “నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు, కానీ నేను నన్ను 25 ఏళ్ల యువకుడిలా భావిస్తున్నాను. నేను 150 సంవత్సరాలు(150 Years Sarathkumar) జీవిస్తాను. అన్ని సంవత్సరాలు ఎలా జీవించాలనే టెక్నిక్స్ ను నేను తెలుసుకున్నాను. 2026 ఎన్నికల్లో నన్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే..  150 ఏళ్లు ఎలా జీవించాలనే సీక్రెట్ ను మీకు కూడా చెబుతాను” అని ఆయన కామెంట్స్ చేశారు.  ” అభివృద్ధి పట్ల దృఢ సంకల్పం ఉన్న నాయకుడే నాయకుడు.. జాతీయతకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మనకు నాయకుడు కావాలి. కృషి, నిజాయితీ, శారీరక బలం, మానసిక బలం ఉన్న నాయకుడిని జనం కోరుకోవాలి” అని శరత్‌కుమార్ అన్నారు. 

సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం శరత్‌కుమార్  కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  కొందరు నెటిజన్స్ శరత్‌కుమార్ కామెంట్స్ ను  అభినందించగా.. మరికొందరు అతని వ్యాఖ్యలపై మీమ్స్ పెడుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి ఎదగడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పలువురు నెటిజన్స్  సూచిస్తున్నారు.  శరత్‌కుమార్ 2007లో తమిళనాడులో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. 2006 నుంచి 2015 వరకు శరత్‌కుమార్ వరుసగా మూడు పర్యాయాలు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.