Salaar : కోర్టు కేసులో ఇరుక్కున్న సలార్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే!

రీసెంట్ గా అతను సలార్ (Salaar) సినిమాలో నటించాడు. తాజాగా బాబీ సింహ ఒక కోర్ట్ వివాదంలో ఇరుక్కున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Actor Salaar Stuck In A Court Case.. What Actually Happened!

Actor Salar Stuck In A Court Case.. What Actually Happened!

Salaar Actor : తమిళ నటుడు బాబీసింహ సౌత్ లో విలక్షణ నటుడిగా దూసుకుపోతున్నాడు. తమిళం తో పాటు తెలుగు, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా బాబి సింహ నటిస్తున్నాడు. రీసెంట్ గా అతను సలార్ (Salaar) సినిమాలో నటించాడు. తాజాగా బాబీ సింహ ఒక కోర్ట్ వివాదంలో ఇరుక్కున్నాడు. అతనిపై కేసు పెట్టింది మరెవరో కాదు అతని చిన్ననాటి స్నేహితుడే.

We’re now on WhatsApp. Click to Join.

ఆలందూర్ కి చెందిన జెఎంఏ హుస్సేన్ బాబి సింహపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. పిటిషన్ లో ఉన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాను బాబి సింహ చిన్ననాటి స్నేహితులం అని, కలిసి చదువుకున్నామని, తన ద్వారా బాబీ సింహాకి జమీర్ ఖాసిం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఖాసిం భవన నిర్మాణంలో పనిచేస్తున్నాడు బాబీ సింహ కొడైకెనాల్లో తాను నిర్మించే భవంతి పనులను ఖాసింకి అప్పగించాడు.

అయితే 90% భవనం పూర్తయినప్పటికీ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదట. దానితో ఖాసిం భాభి సింహ మధ్య తీవ్ర గొడవ జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవని తన తండ్రి పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే 77 ఏళ్ల వయసున్న తన తండ్రిపై బాబీ సింహా బెదిరింపులకు పాల్పడ్డారు. గత ఏడాది మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ నన్ను ఎంతో దూషించాడు.

తన కుటుంబాన్ని తనని బెదిరిస్తున్న బాబీ సింహాపై చర్యలు తీసుకోవాలని కోర్టులో హుస్సేన్ పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు బాబి సింహ కి నోటీసులు జారీ చేసింది. నటుడిగా అటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ భాషల్లో నటిస్తూ అందరి చేత ప్రశంసలు అనుకుంటున్న బాబి సింహ ఇలాంటి వివాదాలలో ఇరుక్కోవటం తన కెరీర్ కి ఎంతైనా ప్రమాదమే. మరి దీనిపై బాబీ సింహ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read:  Sivakarthikeyan : సెలవు రోజున షాక్ ఇచ్చిన శివ కార్తికేయన్ సినిమా.. ఇక ధనుష్ సినిమా ఏ దిక్కు!

  Last Updated: 27 Jan 2024, 11:53 AM IST