Site icon HashtagU Telugu

Chandrayaan-3: చంద్రయాన్-3 పోస్టుపై ప్రకాష్ రాజ్ క్లారిటీ

Chandrayaan-3

New Web Story Copy (68)

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇందుకోసం దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ రచ్చకు దారి తీసింది. ఇండియస్ మూన్ మిషన్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద పోస్ట్ చేసాడు,

చంద్రయాన్-3 మిషన్‌పై తప్పుడు పోస్ట్ చేయడంతో నటుడు ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డారు. ప్రకాష్ రాజ్ పై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సంస్థల నాయకులు అతనిపై బాగల్‌కోట్ జిల్లా బన్‌హట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రయాన్-3ని ఎగతాళి చేస్తూ ప్రకాష్ రాజ్ కార్టూన్‌ను పోస్ట్ చేశాడు. లుంగీ కట్టుకున్న వ్యక్తి ఒక కప్పు నుండి మరొక కప్పుకు టీ పోస్తూ కనిపించాడు. కార్టూన్‌లో కనిపించిన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ ఏమీ చెప్పనప్పటికీ, అతని పోస్ట్‌పై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

అయితే ఇష్యూ కాంట్రవర్సీకి దారి తియ్యడంతో ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది.. నేను ఆర్మ్‌స్ట్రాంగ్ కాలపు జోక్‌ని సూచిస్తున్నాను. మన కేరళ చాయ్‌వాలాని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ రీట్వీట్ చేశాడు.

Also Read: Telangana Schools – Chandrayaan 3 : స్కూళ్లు, కాలేజీల్లో చంద్రయాన్-3 లైవ్.. విద్యార్థులకు చూపించేందుకు ఏర్పాట్లు

Exit mobile version