Prabhas: పెళ్ళి ఎప్పుడో చెప్పేసిన డార్లింగ్…!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే...ఠక్కున ప్రభాస్ అని చెబుతుంటారు. ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి అతని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 15, 2022 / 02:48 PM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే…ఠక్కున ప్రభాస్ అని చెబుతుంటారు. ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి అతని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ యంగ్ రెబల్ స్టార్ కు కాబోయే భార్య ఎవరు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు?ప్రేమ వివాహమా? పెద్దలు కుదిరించిన వివాహమా..?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కేవలం ప్రభాస్ ఫ్యాన్సే కాదు..ప్రభాస్ పెళ్లి కోసం తామూ ఎదురుచూస్తున్నామంటూ..ఈ మధ్యే రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో అతని ఫ్యామిలీ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రభాస్ పెదనాన్న ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ…మనసులో మాట పెట్టేశారు కూడా. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్…పెళ్లిపై ఇప్పటివరకు స్పందిచలేదు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో మరోసారి తన మ్యారేజ్ పై స్పందించాడు ప్రభాస్.

ఈ మధ్యకాలంలో వచ్చిన రాధేశ్యామ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ఓటీటీలోనూ అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ పత్రికకు ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు ప్రభాస్. తాను ఎక్కడకు వెళ్లినా…పెళ్లి గురించి అడుగుతున్నారని…అందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా అని యాంకర్ అడిగారు. దీనిపై స్పందించిన ప్రభాస్…లేదు..నా మ్యారేజ్ గురించి ఫ్యాన్స్ అడిగినప్పుడు నేను అస్సలు చిరాకు పడను. వారు నా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారని అర్థం చేసుకుంటాను. ఇది చాలా కామన్ ప్రశ్న. వారిస్థానంలో నేనూ ఉన్నా అలాగే చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు…ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు తప్పకుండా చెప్తాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.