Actor Prabhas: పెద‌నాన్న కృష్ణంరాజు గురించి ప్ర‌భాస్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌..!

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు గత కొన్ని రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 02:09 PM IST

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు గత కొన్ని రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి చాలా రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ ఇంకా త‌న‌ పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన బాధలోనే ఉంటున్నారు.

పెదనాన్న మృతి చెందిన తర్వాత ప్రభాస్ సినిమా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రభాస్.. కృష్ణంరాజుని ఎంత గౌరవిస్తారో తెలియజేసేలా ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ ఓ వీడియోని క్రియేట్ చేశారు. కృష్ణంరాజు మరణించిన తర్వాత చాలా వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అయ్యాయి. కానీ అందరికీ నచ్చిన వీడియో ఏదైనా ఉంది అంటే అది ఇదే.

అదే వీడియోను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హార్ట్ సింబల్‍తోపాటు.. దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్‌, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ ప్ర‌భాస్‌కు సానుభూతి తెలుపుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఎమోషనల్‌గా క‌నెక్ట్ అవ్వక తప్పదు. ఈ వీడియోలో కృష్ణంరాజు సినిమాలోని సీన్స్‌కి.. ప్రభాస్ సినిమాలోని సీన్స్‌ మ్యాచ్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ అభిమానులు సూప‌ర్‌ వీడియోని క్రియేట్ చేశారు. ఇలాంటి వీడియో చేసినందుకుగాను.. యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ అభిమానులకు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మరోవైపు ప్రభాస్‌ సలార్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్ న‌టిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ తాజాగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది.