Mohanlal Biography: బర్త్‌డే వేళ మోహన్‌లాల్‌ కీలక ప్రకటన.. జీవిత చరిత్రపై పుస్తకం

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ అంటే తనకు చాలా గౌరవమని  మోహన్‌లాల్(Mohanlal Biography) తెలిపారు. 

Published By: HashtagU Telugu Desk
Actor Mohanlal Biography Mukharagam Mohanlal Birthday Kerala

Mohanlal Biography: ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ ఈరోజు 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. తన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 25న విడుదల చేస్తానని మోహన్‌లాల్ వెల్లడించారు. తన జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలకు రచయిత భానుప్రకాశ్ అక్షరరూపం ఇచ్చారని తెలిపారు. ‘ముఖరాగం’(Mukharagam) పేరుతో తన జీవిత చరిత్ర పుస్తకం రిలీజ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ప్రముఖ రచయిత వాసుదేవన్‌ నాయర్‌ ముందుమాట రాశారని చెప్పారు.

Also Read :What Is Golden Dome : అమెరికా రక్షణకు గోల్డెన్‌ డోమ్‌.. ఎలా పనిచేస్తుంది ?

1000 పేజీల పుస్తకం

‘‘నా జీవిత చరిత్ర పుస్తకంలో గత 47 సంవత్సరాల నటనా జీవితంలో జరిగిన ఎన్నో అంశాల గురించి ప్రస్తావన ఉంది. నా జీవిత విశేషాలను పుస్తకం రూపంలో తీసుకురావాలని చాలామంది అడిగారు. వారందరి కోరిక మేరకు ఈ పుస్తకం వస్తోంది. ఈ పుస్తకంలో దాదాపు 1000 పేజీలు ఉంటాయి’’ అని మోహన్‌లాల్ తెలిపారు. ఈమేరకు వివరాలతో ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ అంటే తనకు చాలా గౌరవమని  మోహన్‌లాల్(Mohanlal Biography) తెలిపారు.  ఎన్టీఆర్‌ నటుడిగానూ, ముఖ్యమంత్రిగానూ ఆయా రంగాల్లో తనదైన ముద్ర వేశారని చెప్పారు.

Also Read :Rajiv Gandhi : రాజీవ్‌గాంధీ వర్ధంతి.. రాహుల్ ఎమోషనల్ ట్వీట్.. సోనియా, ఖర్గే, మోడీ నివాళులు

కెరీర్ ప్రస్థానం ఇలా.. 

1960లో జన్మించిన మోహన్‌లాల్‌ 1978లో మూవీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఐదుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. మలయాళ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డుల్లో చాలా వరకు మోహన్ లాల్ పేరిటే ఉంటాయి. మాలీవుడ్‌కు తొలి 50 కోట్ల, 100 కోట్ల, 300 కోట్ల మైలురాయిలను పరిచయం చేసింది ఆయనే. చిన్నప్పట్నుంచీ మోహన్‌లాల్‌‌కు భారత సైన్యం అంటే గౌరవం. సైనికుల జీవితాన్ని తెరమీద చూపాలనే ఉద్దేశంతో ‘కీర్తిచక్ర’, ‘కురుక్షేత్ర’ తదితర సినిమాలను మోహన్‌లాల్ తీశారు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత జనాదరణ కలిగిన టాప్ -5  నటుల్లో ఈయన కూడా ఉన్నారు.

  Last Updated: 21 May 2025, 12:17 PM IST