టాలీవుడ్‌లో హీరోల చుట్టూ ఉండే బౌన్సర్ల (Bouncers)హడావిడి పై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య జరిగిన సంఘటనల్లో బౌన్సర్లు చూపించిన ఆగడాలపై ప్రజలు, అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా సంధ్య థియేటర్ ఘటనలో బౌన్సర్లు పోలీసులకే అడ్డంకులు కలిగించడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే నటుడు బ్రహ్మాజీ (Brahmaji ) కూడా బౌన్సర్ల తీరు మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
Two Young Fans Dead : పరిహారం ప్రకటించిన పవన్, చరణ్
బౌన్సర్ల తీరు గురించి బ్రహ్మాజీ తాజాగా చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. “వీరికి మా యాక్షన్ సరిపోవడం లేదు.. ఏం చేద్దాం?” అంటూ ఆయన సెటైరికల్‌గా స్పందించాడు. ఆ తర్వాత మరో ట్వీట్‌లో “సెట్స్‌లో కూడా వీరి హడావిడి ఏమిటి?” అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇది చూస్తే, బ్రహ్మాజీకి ఇటీవల బౌన్సర్ల వల్ల కొన్ని అసౌకర్యాలు ఎదురైనట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బౌన్సర్ల వ్యవస్థను నియంత్రించాలని చర్యలు తీసుకుంటోంది. బౌన్సర్ల ప్రవర్తనపై నటులు, ప్రేక్షకులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏదైనా ఈవెంట్‌లో పెద్ద హీరోల చుట్టూ ఉండే ఈ బౌన్సర్లు సమయస్ఫూర్తి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇది అందరికీ ఇబ్బందిగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సెట్స్‌లో కూడా బౌన్సర్ల ప్రవర్తన పట్ల బ్రహ్మాజీ ట్వీట్ చేయడంతో, దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “ఎవరి బౌన్సర్లు? ఏ హీరో వల్ల ఇబ్బంది కలిగింది?” అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. మరి బ్రహ్మాజీ దీనిపై మరింత స్పష్టత ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.
ఎక్కడ చూసిన bourncers .. బౌన్సర్లు ..వాళ్ళ overaction ముందు మా action సరిపోవటలేదు .. వాట్ to do ;(
— Brahmaji (@actorbrahmaji) January 6, 2025