టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తి రేపుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ‘స్పిరిట్’ సినిమా నిలిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా తనదైన మార్క్ క్రియేట్ చేసిన సందీప్ వంగా ఈసారి ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడనే అంశంపై సినీ ప్రేక్షకుల్లో అపారమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, ఇటీవల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల చివరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు బృందం సిద్ధమవుతోంది. ప్రభాస్ గత చిత్రాల మాదిరిగా కాకుండా పూర్తిగా భిన్నమైన శైలిలో కనిపించనున్నాడని సమీప వర్గాల సమాచారం.
Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బిగ్ షాక్!
ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ త్రిప్తి దిమ్రి నటిస్తోంది. అదనంగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, సీనియర్ నటి కాంచన, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించబోతుండగా, కొరియా నటుడు డాన్ లీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ కాంబినేషన్‌తో సినిమా ఇంటర్నేషనల్ లెవల్ లుక్ పొందనుందని టాక్ ఉంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ఎంత బలంగా ఉంటాయో ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. అందుకే ‘స్పిరిట్’లో విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేశారన్న దానిపై కూడా భారీగా అంచనాలు పెరిగాయి.
Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!
ఇక తాజాగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన హీరో అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అతను పోషించే పాత్రకు యారోగెన్సీ, పవర్ఫుల్ యాటిట్యూడ్, మాస్ ప్రెజెన్స్ ఉన్న రోల్‌గా ఉంటుందన్న ప్రచారం వినిపిస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం దర్శకుడు సందీప్ స్వయంగా అభిరామ్‌ను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ‘అహింస’ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ప్రభాస్ ప్రధాన పాత్రలో ఉన్న ఇంత భారీ ప్రాజెక్ట్‌లో అభిరామ్ నటిస్తే అది ఆయన కెరీర్‌కు నిజమైన టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా, ‘స్పిరిట్’ చుట్టూ ఆసక్తి, అంచనాలు రోజురోజుకీ పెరుగుతుండగా, అధికారిక అప్డేట్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
