ప్రేమ దేశం (Prema Desham) సినిమాలో లవర్ బాయ్ గా కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ హీరో ‘అబ్బాస్'(Abbas). హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో అబ్బాస్ అనేక సినిమాలు చేశాడు. అయితే 2015 నుంచి మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫారిన్ వెళ్ళిపోయాడు. అక్కడే ఒక జాబ్ చేస్తూ లైఫ్ సాగిస్తూ వచ్చాడు. అయితే ఇటీవలే ఈ నటుడు మళ్ళీ తిరిగి చెన్నై(Chennai)లో ల్యాండ్ అయ్యాడు. దీంతో తెలుగు, తమిళంలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా, దానిలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో తన స్నేహం గురించి బయటపెట్టాడు. పవన్ సినిమాల్లోకి రాకముందు అబ్బాస్ తో మంచి స్నేహం ఉండేదట. ఇద్దరు రెగ్యులర్ గా చెన్నైలో కలుకునేవారట. ఇద్దరు కలిసి చెన్నైలో సరదాగా తిరిగేవారట. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలోకి వెళ్లిన తరువాత బిజీ అయ్యిపోవడంతో ఆ తరువాత కలవడం కుదరలేదని చెప్పుకొచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో పవన్ అండ్ అబ్బాస్ ప్రేమ కథా సినిమాలతో యూత్ లో భారీ క్రేజ్ నే సంపాదించుకున్నారు.
అంతేకాదు వీరిద్దరిలో ఒక కామన్ పాయింట్ కూడా అభిమానులు ఉన్నారు. అదేంటో కాదు, వీరిద్దరి హెయిర్ స్టైల్. అప్పటిలో యూత్ హెయిర్ కటింగ్ షాప్ కి వెళ్లి అబ్బాస్‌లా కటింగ్ ఉండాలి, పవన్‌లా స్టైల్ గా చేయమని అడిగేవారు. అంతటి ఫేమ్ ని సంపాదించుకున్న అబ్బాస్ ఆ తర్వాత సరైన హిట్టు లేక ఫేడ్ అవుట్ అయ్యిపోయాడు. అబ్బాస్ తమిళంలో పలు టీవీ షోల్లో కూడా నటించాడు. కాగా అబ్బాస్ భార్య, హీరో మాధవన్ భార్యతో కలిసి పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా చేశారు. అబ్బాస్ కి ఒక పాప, బాబు ఉన్నారు.
Also Read : Mega Updates: చిరంజీవి దూకుడు, మరో రెండు సినిమాలకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్