Site icon HashtagU Telugu

Aadikeshava Trailer : ఆదికేశవ ట్రైలర్ టాక్ ..

Adhikeshav Trailer

Adhikeshav Trailer

మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav tej) – శ్రీలీల (Sreeleela) జంటగా నాగ వంశీ నిర్మాణం లో తెరకెక్కిన మూవీ ‘ఆదికేశవ’ (Aadikeshava). దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేయాలనీ చిత్ర మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ వరల్డ్ కప్ ఉండడం తో నవంబర్ 24 కు వాయిదా వేశారు. ఇక రిలీజ్ సమయం మరో మూడు రోజులే ఉండడం తో సినిమా తాలూకా ట్రైలర్ (Aadikeshava Trailer) ను రిలీజ్ చేసి ఆసక్తి నింపారు. ఇప్పటివరకు కూల్ గా లవర్ బాయ్ గా కనిపించిన వైష్ణవ్ ..ఈ మూవీ లో మాత్రం మాస్ హీరో అవతారమెత్తాడు. ట్రైలర్ మొత్తం యాక్షన్ తో పాటు రొమాంటిక్ , కామెడీ యాంగిల్ లో కట్ చేసి సినిమాలో అన్ని కోణాలు ఉన్నాయని చెప్పకనే చెప్పాడు డైరెక్టర్.

‘ట్రైలర్‌లో వైష్ణవ్ తేజ్‌ పాత్ర చాలా డైనమిక్‌గా కనిపిస్తుంది. అలాగే శ్రీలీలతో తేజ్ కెమిస్ట్రీ అదిరిపోయింది.. ఇద్దరి మధ్య సన్నివేశాలు క్యూట్‌గా ఉన్నాయి. మరి సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో మరి.. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌కు తల్లిగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ నటించారు. అలాగే, హీరోతో కమెడియన్ సుదర్శన్ కాంబినేషన్ బాగుంది. ఇక మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్‌గా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు శ్రీకాంత్ డైరెక్టర్ . ‘ఆదికేశవ’ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మాతలు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ నిర్మాణ సంస్థలు తెరకెక్కించాయి.

Read Also : Chandrababu : చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు – సజ్జల