టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ మరియు లావణ్య (Raj Tarun – Lavanya) వ్యవహారం అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను లైంగికంగా వాడుకున్నాడని, తర్వాత పెళ్లికి మొహం చాటేశాడని ఆరోపిస్తూ రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ కేసు చుట్టూ జరిగిన పరిణామాలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ క్రమంలో ఆర్జే శేఖర్ బాషా (Sekhar Bhasha) రాజ్ తరుణ్‌కు మద్దతుగా బహిరంగంగా మాట్లాడడం, లావణ్యతో జరిగిన డిబేట్ వైరల్ కావడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. కొన్ని నెలలుగా మీడియా నుంచి దూరంగా ఉన్న శేఖర్ బాషా తాజాగా మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Mini Battle Tank : వావ్.. మినీ యుద్ద ట్యాంక్ ను తయారు చేసిన కాకినాడ యువకుడు
ఈ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా మాట్లాడుతూ.. మగవారిపై అన్యాయం ఎక్కువగా జరుగుతోందని, మగవాళ్లకు కూడా న్యాయం జరగాలని ఇందుకోసం పోరాటం చేయడానికి కూడా తాను సిద్ధం అని శేఖర్ అన్నారు. పురుషుల హక్కుల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తానని , కనీసం 2000 మందితో భారీ ర్యాలీ, 90కిపైగా అర్జీలను పార్లమెంటులో సమర్పిస్తానని అన్నారు. పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ అవసరం ఉందని, ఇది కేవలం నినాదంగా కాకుండా, నిజంగా చట్టసభలో వినిపించే స్థాయికి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆడవాళ్లు కుటుంబాలను నాశనం చేస్తున్నారని, తల్లిదండ్రులు తమ అమ్మాయిలను నిజాయితీగా, జవాబుదారీతనంతో పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక ఇప్పుడు శేఖర్ బాషా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒక మగాడు చెడిపోతే దానికి కారణం ఆడవారే అవుతారని, బాధనంతటినీ మగవాడు మౌనంగా భరిస్తాడని వ్యాఖ్యానించారు.