Site icon HashtagU Telugu

AR Rahman & Saira Banu Divorce : విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు

Ar Rahman Divorce

Ar Rahman Divorce

లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మరియు ఆయన భార్య సాయిరా బాను (AR Rahman & Saira Banu Divorce) 29 సంవత్సరాల పెళ్లి తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి సాయిరా బాను, తన భర్త ఆర్.ఆర్. రహమాన్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడి కారణంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. చిత్రసీమలో పెళ్లిళ్లు , విడాకులు అనేవి కామన్ గా మారిపోయాయి. షూటింగ్ సమయంలో దగ్గరవ్వడం, ప్రేమించుకోవడం , కొద్దీ రోజులపాటు సహజీవనం చేయడం, ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం..ఏడాది , రెండేళ్లు తిరిగేలోపే విడాకులు తీసుకోని ఎవరి దారి వారు చూసుకోవడం కామన్ గా మారింది. ఈ మధ్య టాలీవుడ్ లో కూడా ఈ కల్చర్ ఎక్కువైంది.

మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ 29 ఏళ్ల వివాహ బంధానికి తెరదించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడాకుల విషయాన్ని స్వయంగా రహమాన్ భార్య సైరా బాను స్వయంగా తెలిపింది. రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని సైరా బాను పోస్ట్ చేసింది. వీరి విడాకులకు సంబంధించి సైరా బాను తరఫున లాయర్ వందనా షా అధికారిక ప్రకటన చేశారు. ఇక వీరి దారులు వేరు, రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకున్నారు అని లాయర్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎన్నో సంవత్సరాల వివాహ బంధానికి రెహమాన్, సైరాబాను స్వస్తి పలికారు. భర్త రెహమాన్ నుంచి విడిపోవాలని సైరాబాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో కలతలు రావడంతో చాలా కష్టమైన నిర్ణయం సైరా బాను తీసుకున్నారు. వారి మధ్య ఎంతో అన్యోన్యత, ప్రేమ ఉన్నప్పటికీ వారి వివాహ బంధంలో ఎంతో ఒత్తిడి, కష్టాలు ఎదురవుతున్నాయి. దాంతో వీరి బంధం కొనసాగించాలని ఈ దంపతులు భావించడం లేదు’ అని సైరా బాను తరఫున లాయర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎంతో బాధతో కూడిన నిర్ణయం సైరా బాను తీసుకున్నారని, తన జీవితంలో కష్టకాలం అని.. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ఆమె కోరుతున్నారని తెలిపారు.

రెహమాన్, సైరా బానులు 1995లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్‌ ఉన్నారు. కుమారుడు అమన్ రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6న పుట్టాడు. దాదాపు మూడు దశాబ్దాలు కలిసున్న ఈ జంట విడాకులకు వెళ్లడం సినీ ప్రముఖులను, అభిమానులను బాధిస్తోంది.

Read Also : Weight Loss : ఇడ్లీ, దోసె తింటే బరువు తగ్గవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు..!