సంక్రాంతికి విడుదలైన సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ థియేటర్స్ లలో విడుదలైంది. కానీ మొదటి ఆట తోనే మిక్సెడ్ టాక్ రావడం ఇదే క్రమంలో పైరసీ ప్రింట్ రావడం తో సినిమా పై ఎఫెక్ట్ భారీగా పడింది.
Notices to BRS MLAs : పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు
టాక్ తో పాటు ప్రింట్ కూడా వచ్చేయడం, ఇదే క్రమంలో సంక్రాంతి బరిలో వచ్చిన డాక్ మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సూపర్ హిట్ టాక్ రావడం తో జనాలంతా ఆ సినిమాలే చూసేందుకు పోటీ పడ్డారు. దీంతో గేమ్ ఛేంజర్ ను పట్టించుకునే నాధుడు కరవయ్యాడు. దీంతో మూడు రోజులకే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. విడుదలైన 28 రోజుల్లోనే ఈ చిత్రం OTTలోకి రానుండటం గమనార్హం.