Site icon HashtagU Telugu

RRR Oscar Promotions: ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెడుతారా? ఆర్ఆర్ఆర్ పై తమ్మారెడ్డి ఫైర్

Rrr

Rrr

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది. మూవీ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సత్తా చాటి ఫారినర్లను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా క్రేజ్ పక్కన పెడితే, ఆస్కార్ సాధించడం కోసం ఈ సినిమా యూనిట్ కోట్ల రూపాయలు ప్రమోషన్ (Promotions) కి ఖర్చు పెట్టిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ ప్రమోషన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి (Tammareddy) భరద్వాజ. ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ (RRR) 80కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో తాము 8 సినిమాలు తీసి ముఖాన కొడతామని అన్నారాయన. కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నారు. మేము సమాజాన్ని మార్చాలని సినిమాలు తీయడం లేదు. మాకు నచ్చి సినిమాలు తీస్తున్నాం.

సమాజంలో మార్పుకోసం ప్రయత్నిస్తాం కానీ, సమాజాన్ని ఉద్దరించడానికే మేము పుట్టలేదు” అంటూ ఓ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు తమ్మారెడ్డి (Tammareddy). ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. భారీ బడ్జెట్ సినిమాలు, వాటి ప్రమోషన్లు అనే టాపిక్ పైనే తమ్మారెడ్డి (Tammareddy) ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కానీ, ఆయన ఆర్ఆర్ఆర్ ని కానీ, దర్శకుడు, హీరోలను కానీ కించపరచలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తమ్మారెడ్డి వ్యాఖ్యలు విపరీతంగా ట్రోల్ (Trolls) అవుతున్నాయి.

Also Read:Covid 19: వామ్మో కరోనా.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కేసులు!

Exit mobile version