20 ఇయర్స్ క్రితం ప్రేక్షకుల మనసులు గెలిచిన “7జి బృందావన కాలనీ” (7G Brindavan Colony) ఇప్పుడు సీక్వెల్‌తో మళ్లీ తెరపైకి రానుందని టాక్. క్లాసిక్ లవ్ స్టోరీగా గుర్తింపు పొందిన ఈ సినిమాకు కొనసాగింపుగా “7జి బృందావన కాలనీ 2” (7G Brindavan Colony 2)గుట్టుచప్పుడు కాకుండా తెరకెక్కుతోంది. దర్శకుడు సెల్వ రాఘవన్ (Selva Raghavan) ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల ప్రకారం సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయిందట. ఈసారి కథ రవి జీవితం చుట్టూ తిరుగనుంది ..ప్రియురాలి మరణం తర్వాత ఒంటరితనంలో జీవిస్తున్న అతని కథే ఈ కథ అని చెప్పుకొచ్చాడు.
Surya Tilak Of Ramlalla: అయోధ్యలో రేపు అద్భుతం.. రామయ్యకు సూర్యతిలకం!
ప్రస్తుతం రవికృష్ణ (Ravikrishna ఈ సీక్వెల్‌తో మళ్లీ నటన రంగంలోకి అడుగుపెడుతున్నారు. మొదటి పార్టులో హీరోయిన్ సోనియా అగర్వాల్ పాత్ర చనిపోవడంతో ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా రివీల్ కాలేదు. రవి జీవితంలో కొత్త వెలుగు తీసుకువచ్చే వ్యక్తిగా ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఉత్సుకతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం మరోసారి మ్యాజిక్ చేస్తుందా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు సెల్వ రాఘవన్ “యుగానికి ఒక్కడు” సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ధనుష్‌తో ప్యాన్ ఇండియా లెవెల్లో తీసే ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవసరం కావడంతో ప్రస్తుతం నిర్మాత కోసం ఎదురుచూస్తున్నారట. మొదటి భాగంలో కార్తీ పాత్ర కొనసాగుతుందన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా సెల్వ రాఘవన్ దర్శకత్వం కంటే నటనపై ఎక్కువగా దృష్టి పెట్టినప్పటికీ, ఈ రెండు సినిమాలతో మళ్లీ తన ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఈ రీ ఎంట్రీలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.