69th National Film Awards : నేషనల్ అవార్డ్స్‌లో తెలుగు సినిమా సత్తా..

2021 లో సెన్సార్ అయిన సినిమాలని పరిగణలోకి తీసుకొని 69 వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ (69th National Film Awards) ప్రకటించారు.

  • Written By:
  • Updated On - August 25, 2023 / 11:25 AM IST

69th National Film Awards : అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులు నేడు ప్రకటించారు. 2021 లో సెన్సార్ అయిన సినిమాలని పరిగణలోకి తీసుకొని 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ (69th National Film Awards) ప్రకటించారు. ఇటీవల మన తెలుగు సినిమాలు అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి దేశస్థాయిలో మరోసారి తెలుగు సినిమాలు సత్తా చాటాయి.

69th National Film Awards లో మన తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డులు ఇవే..

అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం – RRR

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 1)

ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ – మేల్ – కాల భైరవ (కొమురం భీముడో సాంగ్) – RRR

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – సాంగ్స్ – పుష్ప – దేవిశ్రీ ప్రసాద్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – RRR – కీరవాణి

బెస్ట్ లిరిక్స్ – చంద్రబోస్ – కొండపొలం – ధమ్ ధమ్ ధమ్ సాంగ్

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ – RRR – శ్రీనివాస మోహన్

బెస్ట్ కొరియోగ్రఫీ – RRR – నాటు నాటు – ప్రేమ్ రక్షిత్

బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ – RRR – కింగ్ సల్మాన్

బెస్ట్ తెలుగు ఫిలిం – ఉప్పెన

నేషనల్ లెవెల్ లో మన సినిమాలు ఏకంగా ఇన్ని అవార్డులు సాధించి మరోసారి తెలుగు సినిమా స్థాయి దేశమంతటా తెలిసేలా చేశాయి.

Also Read:  Root Vegetables: రూట్ వెజిటేబుల్స్ చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం.. బరువు, మధుమేహాన్ని నియంత్రించడంలో మేలు..!