గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్ (Game Changer ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతుంది. జనవరి 10 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈరోజు రాజమండ్రి లో ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కావడం తో సినిమాకు మరింత బజ్ వచ్చింది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు ఏపీకి సంబదించిన పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు హాజరై సందడి చేసారు. ఇక ఈ వేదికపై 30 ఇయర్ పృద్వి మాట్లాడుతూ..మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ పై సెటైర్లు వేసి మెగా , జనసేన , కూటమి శ్రేణులను ఆకట్టుకున్నాడు.
సభల్లో జగన్ మైక్ ను తడుతూ అభివాదం చేసినట్లుగా పృథ్వీ చేశారు. ‘మా దేవుడు పవన్ కళ్యాణ్.. గేమ్ ఛేంజర్ ఆఫ్ AP పాలిటిక్స్. ఇది దేవుడి స్క్రిప్ట్. మొన్నే ఓ సినిమాలో అపోజిషన్ వ్యక్తి క్యారెక్టర్ చేయించారు. అసలే పవర్లో లేను.. 11 సీట్లే వచ్చేశాయి ఏం చేయాలి అని చెప్పా’ అంటూ తనదైన శైలి లో స్పీచ్ ఇచ్చి మెగా అభిమానుల్లో జోష్ నింపారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమా సూపర్ సక్సెస్ కావాలని , చరణ్ కు ఉత్తమ్ అవార్డు రావాలని కోరుకున్నారు.
Read Also : Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!