Site icon HashtagU Telugu

Pushpa2 Theatrical Rights: తగ్గేదేలే.. పుష్ప2 ‘థియేట్రికల్ రైట్స్’ 1000 కోట్లు?

allu arjun sankrati treat Pushpa2 update

Pushpa2

టాలీవుడ్ (Tollywood) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప (Pushpa) మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీ తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో తిరుగులేని రికార్డులు సాధించి సౌత్ సత్తా ఎంటో చాటి చెప్పింది. ముఖ్యంగా పుష్పరాజ్ నటన, శ్రీవల్లీ అందాలు, సమంత (Samantha) స్పెషల్ సాంగ్ ఈ మూవీకి పెద్ద హైలైట్. ఈ మూవీ మొత్తంగా 400 కోట్లు సాధించిందని టాక్. ఆ సినిమా విజయంతో పుష్ప2 మూవీని తగ్గేదే లే అంటూ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక బన్నీ కూడా ఇతర ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసుకొని కేవలం పుష్ప ది రూల్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త అందర్నీ ఆకర్షిస్తోంది. థియేట్రికల్ రైట్స్ (Theatrical Rights) 1000 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇదే విజయాన్ని ఓ బాలీవుడ్ క్రిటిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అన్నీ భాషల్లో కలిపి వెయ్యి కోట్లు అయ్యి ఉండవచ్చునేమోనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే థియేట్రికల్ రైట్స్ (Theatrical Rights) లో విషయంలో పుష్ప2 మూవీ రిలీజ్ కు ముందే రికార్డులు నెలకొల్పినట్టే.

Also Read: Tractor Accident: డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన ట్రాక్టర్, చక్కర్లు కొడుతున్న వీడియో!