10 years of Mirchi: ప్రభాస్ ‘మిర్చి’కి పదేళ్లు.. బ్లాక్ బస్టర్ మూవీ తయారైంది ఇలా!

ఆ ఊరికి రావాలంటే నువ్వు స్కెచ్ వేసుకుని రావాలి నేను హ్యాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకొచ్చేస్తా

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 03:10 PM IST

ఒక కథ – అనేక కథనాలు, మూలకథ ఒకటే కానీ తీసుకున్న నేపథ్యం వేరు, తెలుగు (Tollywood)లో ఈ తరహాలో చాలా సినిమాలున్నాయి, కథ అదే, స్క్రీన్ ప్లే వేరు, పాత్రలు వేరు, నేపథ్యం వేరు… రాజశేఖర్ – ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో వచ్చిన “అన్న” (Anna) సినిమాలో కొమరన్న అనే గిరిజన అమాయకుడు అన్నగా మారాక కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కొంటాడు. బయటి గొడవలకు దూరంగా ఉండాలనేది అన్న భార్య (గౌతమి) అభిమతం, కానీ అన్న (రాజశేఖర్) మాత్రం రోజూ ఒక గొడవకు వెళ్లి రక్తపు మరకలతో ఇంటికి వస్తుంటాడు, అలా రావడం ఇష్టం లేని అన్న భార్య, గొడవలకు కొట్లాటలకు వెళ్ళే భర్త కాళ్ళకు కొడుకును అడ్డం పెడుతుంది.

తన కొడుకు కంటే జనమే ముఖ్యం అనుకునే అన్న కొడుకును దాటి జనం కోసం, ప్రజలకు న్యాయం చేయడానికి వెళతాడు, ఇది కథలో చిన్న లైన్ (Story line) దీన్ని రెండు ఊర్ల మధ్య గొడవలు, పగ, ప్రతీకారాలు నేపథ్యంలో కొంత స్క్రీన్ ప్లే మార్చి తీసిన సినిమా మిర్చి (Mirchi)
దీనికన్నా ముందే అచ్చం ఇలాంటి కథతో గోపీచంద్ శంఖం (Shankam) అనే సినిమా వచ్చింది, విచిత్రం ఏమిటంటే అక్కడా ఇక్కడా తండ్రి పాత్ర చేసింది ఒకే నటుడు ఆయనే సత్యరాజ్ గారు.

ఒక పాతకథకు కొత్త మెరుగులు దిద్దిన విధానం సూపర్బ్ గురూజీ… ప్రభాస్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్, మిర్చి టైటిల్ సాంగ్, కమర్షియల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్, ట్విస్ట్ టోటల్ గా బ్లాక్ బస్టర్ “మిర్చి” తయారైంది, అయితే ఈ మిర్చీ (Mirchi)కి ఘాటెక్కువ…
దర్శకుడు కొరటాల శివ స్వతహాగా రచయిత కావడం చాలా ఉపయోగపడింది “వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు” డైలాగ్ చాలా ఆకట్టుకుంది.

“కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్” అయితే వేరే లెవెల్, ఇంకా చాలా ఉన్నాయి… “ఆ ఊరికి రావాలంటే నువ్వు స్కెచ్ వేసుకుని రావాలి నేను హ్యాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకొచ్చేస్తా” పీక్స్ “ఒక్క అవకాశం ఇ‌స్తావా ఇక్కడ (గుండెల్లో) పెట్టుకుని చూసుకుంటా, ఇలా అయితే ఈ అమ్మాయికి ఏంటి రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వవు, ఏం పాపం చేస్తే పుట్టావురా నువ్వు”

కొరటాల (Koratala) పెన్ను గన్ను కన్నా పవర్ ఫుల్ గా పేలింది. బుల్లెట్ల ధార డైలాగుల రూపంలో గుండెల్లోకి చొచ్చుకుని పోయాయి, ఈ హిట్ తో ఆకలి మీదున్న ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు, వాన ఫైట్ ను కొన్ని రోజుల తర్వాత యాడ్ చేశారు, దేవీశ్రీప్రసాద్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూనకాలే.. ప్రభాస్ నటన సినిమా స్థాయిని పెంచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన శైలిలో మెప్పించాడు, నదియా తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇదే (Mirchi)…

ప్రభాస్ (Prabhas) నుంచి ఎలాంటి సినిమా కావాలని ఆయన ఫ్యాన్స్ & సాధారణ ప్రేక్షకులు కోరుకున్నారో అలాంటి సినిమా మిర్చి, ఒక బ్లాక్ బస్టర్ (Block buster) సినిమాకు ఉండాల్సిన అన్ని రకాల ఫార్ములాలు, మసాలాలు సమపాళ్లలో కుదిరిన సినిమా మిర్చి, కారమెక్కువగా ఉన్నా, ఘాటెక్కువగా ఉన్నా అందరూ ఇష్టపడే మిర్చి లాంటి కుర్రాడు ఈ జై, ఒక సినిమా దశాబ్దం పాటు అలరించింది అంటే ఖచ్చితంగా అది హిట్ సినిమానే… ఇంత సీరియస్ సినిమాలో కూడా బ్రహ్మానందం కామెడీ నువ్వుల పరిమళాలు వెదజల్లుతుంది, అనుష్క, సత్యరాజ్, ఆదిత్య మీనన్, సంపత్, రఘుబాబు, సుబ్బరాజు, నాగినీడు, బెనర్జీ సత్యం రాజేష్, తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Also Read: Drive-in Theatre: మూవీస్ థ్రిల్లింగ్స్.. హైదరాబాద్ లో డ్రైన్ ఇన్ థియేటర్స్!