Site icon HashtagU Telugu

OTP Disruption : డిసెంబరు 1 నుంచి కొన్ని ఓటీపీలు లేట్.. ఇంకొన్ని ఓటీపీలు రావు

Otp Disruption Otp Messages Indian Telecom Giants

OTP Disruption : ఆన్‌లైన్ లావాదేవీలు,  బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా లాగిన్స్ వంటి వాటి కోసం ‘ఓటీపీ’లు తప్పనిసరి. అయితే డిసెంబరు 1 తర్వాత కొన్ని ఓటీపీలు మన ఫోన్లకు అందడంలో జాప్యం జరగొచ్చు. ఇంకొన్ని ఓటీపీలు పూర్తిగా రాకపోవచ్చు. దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే స్మార్ట్ ఫోన్లను వాడే వాళ్లు రెడీ అయిపోతే బెటర్. ఇంతకీ కొన్ని రకాల ఓటీపీలు ఎందుకు రావు ? కారణమేంటి ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండు వారాల గడువు

స్పామ్ మెసేజ్‌లు, ఫిషింగ్ మెసేజ్‌, మార్కెటింగ్ మెసేజ్‌లతో జనం చాలా సతమతం అవుతున్నారు. అలాంటి మెసేజ్‌లలోని లింకులను క్లిక్ చేసి కొందరు మోసపోతున్నారు. అకౌంట్లలోని డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఆ తరహా మోసపూరిత మెసేజ్‌లను పంపే సంస్థలు, వ్యక్తుల మూలాలను గుర్తించి, బ్లాక్ చేయాలని కొంతకాలం క్రితం టెలికాం కంపెనీలకు భారత టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భారత టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నిమగ్నమై ఉన్నాయి. పదేపదే ప్రజలకు మార్కెటింగ్ మెసేజ్‌లను పంపాలని భావించే సంస్థలు ప్రత్యేక అనుమతులను టెలికాం కంపెనీల నుంచి పొందాలి. ఇందుకోసం ఆయా సంస్థలు డిక్లరేషన్లను సైతం సమర్పించాలి.

అయితే ఇదంతా పాటించకుండా మార్కెటింగ్ మెసేజ్‌లను ప్రజలకు పంపుతున్న సంస్థలను ఇప్పటికే టెలికాం కంపెనీలు గుర్తించాయి. ఓటీపీలతో(OTP Disruption) నిత్యం అవసరం ఉండే ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా కంపెనీలను కూడా సంప్రదించాయి.   ఇక స్పామ్ మెసేజ్‌లు, ఫిషింగ్ మెసేజ్‌లను పంపుతున్న సంస్థల వివరాలతోనూ టెలికాం కంపెనీలు జాబితాను తయారు చేశాయి. ప్రస్తుతం వాటన్నింటికి టెలికాం కంపెనీలు వార్నింగ్ మెసేజ్‌లను పంపుతున్నాయి.  ట్రాయ్ నిబంధనలను పాటించకుంటే బ్లాక్ చేయకతప్పదని హెచ్చరిస్తున్నాయి. వీటిని పెడచెవిన పెట్టే సంస్థల ఓటీపీ డెలివరీ సేవలను డిసెంబరు 1 నుంచి టెలికాం కంపెనీలు బ్లాక్ చేయనున్నాయి. ఎందుకంటే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఇచ్చిన డెడ్‌లైన్ డిసెంబరు1తోనే ముగియనుంది.  ఈ కారణం వల్లే డిసెంబరు 1 తర్వాత కొన్ని సంస్థల ఓటీపీలు మన ఫోన్లకు చేరడంలో జాప్యం జరగొచ్చు. మునుపటి కంటే కొంత లేటుగా ఓటీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్ని సంస్థల ఓటీపీలు పూర్తిగా అందకపోవచ్చు. అందుకే మన ఆన్‌లైన్ అకౌంట్లు అదనంగా సేఫ్‌గా ఉండాలంటే  ‘టూ ఫాక్టర్ అథెంటికేషన్’ (2FA) చేయించుకోవాలి. అకౌంట్లకు బలమైన పాస్‌వర్డ్‌లను వాడాలి.  మన ఫోన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.