ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల్లో యెస్ బ్యాంక్ కూడా ఒకటి. అయితే ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డి వడ్డీ రేట్లను తగ్గించటం మొదలుపెట్టాయి. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్‌ను మూసివేయడంతో పాటు వడ్డీ రేట్లను తగ్గించగా, ఇప్పుడు యెస్ బ్యాంక్ కూడా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు తగ్గిస్తూ సడెన్ షాక్ ఇచ్చింది.
Mahila Samman Savings Scheme : మహిళలకు షాక్ ఇచ్చిన కేంద్రం
ప్రస్తుతం రూ. 3 కోట్ల లోపు విలువైన డిపాజిట్లపై యెస్ బ్యాంక్ సాధారణ ఖాతాదారులకు 3.25% నుంచి గరిష్టంగా 7.75% వరకు వడ్డీ అందిస్తోంది. గతంలో ఇది 3.25% – 8% మధ్య ఉండేది. ఇక సీనియర్ సిటిజెన్లకు 3.75% – 8.25% వడ్డీ లభిస్తుంది, ఇది గతంలో 3.75% – 8.50% ఉండేది. ముఖ్యంగా 12-24 నెలల టెన్యూర్ డిపాజిట్లపై అత్యధికంగా 7.75% వడ్డీ లభిస్తుండగా, సీనియర్ సిటిజెన్లకు ఇదే కాల వ్యవధిలో 8.25% వడ్డీ లభిస్తోంది.
SRH : SRH కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఆఫర్
ఈ వడ్డీ రేట్ల తగ్గింపుతో ఎఫ్‌డి పెట్టుబడిదారులు కొంత నష్టపోతారని భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించడంతో, ఎఫ్‌డి ద్వారా పొందే ఆదాయం తగ్గిపోతుంది. ఈ పరిణామం ప్రత్యక్షంగా రిటైర్డ్ వ్యక్తులు, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోరుకునే పెట్టుబడిదారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు బ్యాంక్ ఎఫ్‌డీలకంటే ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌సీ (National Savings Certificate), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), రికరింగ్ డిపాజిట్లు (RD) వంటి ఇతర పొదుపు మార్గాలపై దృష్టి పెడుతున్నారు.