Rs 800 Coins : రూ.800, రూ.900 కాయిన్స్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మన భారత దేశంలో ఇంత పెద్ద విలువ కలిగిన నాణేలను విడుదల చేశారు. 2024 డిసెంబరులోనే భారత ప్రభుత్వం వీటిని రిలీజ్ చేసింది. వివరాలివీ..
Also Read :Vijayashanti: మంత్రి పదవి రేసులో విజయశాంతి.. ఎమ్మెల్సీ రావడానికి కారణం అదేనట
రూ.800, రూ.900 నాణేల గురించి..
- వివిధ ప్రత్యేక సందర్భాల్లో భారత ప్రభుత్వం స్మారక నాణేలను విడుదల చేస్తుంటుంది. ఈ సంప్రదాయం 1964 సంవత్సరం నుంచే కొనసాగుతోంది.
- ఈక్రమంలోనే 2024 డిసెంబరు రూ.800(Rs 800 Coins), రూ.900 నాణేలను భారత సర్కారు రిలీజ్ చేసింది.
- జైనుల 23వ తీర్థంకరుడు పార్శ్వ నాథుడి 2,900వ జయంతి, 2,800వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రెండు నాణేలను భారత సర్కారు విడుదల చేసింది.
- పార్శ్వ నాథుడి 2,900వ జయంతి సందర్భంగా రూ.900 నాణేన్ని రిలీజ్ చేశారు. ఈవిషయాన్ని ఆ నాణెంపై స్పష్టంగా రాశారు. దానిపై పార్శ్వ నాథుడి ఫొటో కూడా ఉంది.
- పార్శ్వ నాథుడి 2,800వ వర్ధంతిని పురస్కరించుకొని రూ.800 నాణేన్ని రిలీజ్ చేశారు. ఈవిషయాన్ని నాణెంపై రాశారు. దీనిపైనా పార్శ్వ నాథుడి ఫొటో ఉంది.
- ఈ నాణేలను భారత ప్రభుత్వం ద్వారా విడుదల చేయించడంలో జైన మతానికి చెందిన వ్యాపారవేత్త లలిత్ నహతా కీలక పాత్ర పోషించారు.
- ‘భారత నాణేల ముద్రణ చట్టం 2011’ ప్రకారం.. గరిష్ఠంగా రూ.1,000కి మించిన విలువ కలిగిన నాణేలను ముద్రించడానికి వీల్లేదు. అందుకే గరిష్ఠంగా రూ.900 నాణెంతో ఆగిపోయారు.
- రూ.800, రూ.900 నాణేల తయారీ విషయానికి వస్తే.. ఒక్కో నాణెం తయారీకి 40 గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించారు. ముంబైలోని భారత ప్రభుత్వ నాణేల ముద్రణా శాలలో వీటిని తయారు చేయించారు.
- ఆసక్తి కలిగిన వారు సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నాణేలను బుక్ చేసుకోవచ్చు. రెండు కాయిన్ల కోసం బుకింగ్ ధర రూ.6,900 (70 డాలర్లు).
Read :Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?