Dubai Gold : దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా మనదేశంలోకి తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో నటి రన్యారావు దొరికిపోయింది. ఇంతకీ దుబాయ్ నుంచి బంగారాన్ని ఎందుకు తీసుకొచ్చింది ? అంటే.. అక్కడ గోల్డ్ ధర చాలా తక్కువ. దుబాయ్‌లో గోల్డ్ కొంటే, దానిపై ఎలాంటి అదనపు ట్యాక్స్‌లను కట్టాల్సిన అవసరం ఉండదు. అందుకే దుబాయ్ నుంచి భారత్‌కు అతిగా బంగారాన్ని తరలిస్తే స్మగ్లింగ్‌గా పరిగణిస్తారు. ఈవిషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Mohammed Shami : టీమిండియా షాంపేన్ వేడుక వేళ వేదిక దిగిన షమీ.. కారణమిదీ
దుబాయ్‌లో చౌక.. కారణమిదీ
మన దేశంలోని బంగారం దుకాణానికి వెళ్లి ఆభరణాలు(Dubai Gold) కొంటే, వాటిపై రకరకాల ట్యాక్స్‌లు విధిస్తారు. మనం చేసే లావాదేవీని బట్టి ఈ ట్యాక్సులు పెరుగుతుంటాయి. ఈ తోక ట్యాక్సులేవీ దుబాయ్‌లో ఉండవు. బంగారాన్ని మార్కెట్ రేటు ప్రకారం అక్కడ విక్రయిస్తారు. ఎందుకిలా అమ్ముతున్నారు ? అంటే.. దుబాయ్ ప్రభుత్వం అక్కడి గోల్డ్ వ్యాపారుల బంగారం దిగుమతులపై అస్సలు ట్యాక్స్ విధించదు. దీంతో ఆ వ్యాపారులు కూడా ట్యాక్స్ లేకుండా, మార్కెట్ ధర ప్రకారం దాన్ని అమ్మేస్తారు. వీలైనంత మేరకు సేల్స్‌ను పెంచుకుంటారు. ఈక్రమంలో భారీ తగ్గింపు ఆఫర్లతో పరస్పరం పోటీ పడుతుంటారు.
Also Read :Failure Story : మరో అనిల్ అంబానీ.. ప్రమోద్ మిట్టల్ ఫెయిల్యూర్ స్టోరీ.. చూసి నేర్చుకోండి
ఎంత తెచ్చుకోవచ్చు ?
భారతీయులు విదేశాల్లో 6 నెలలలోపే ఉండి, తిరిగొచ్చేటప్పుడు బంగారం తీసుకొస్తే 38.5 శాతం కస్టమ్స్ సుంకం పే చేయాలి. ఆరు నెలలకుపైగా విదేశాల్లో ఉండి తిరిగొస్తే.. పురుషులు 20 గ్రాముల గోల్డ్, మహిళలు 40 గ్రాముల గోల్డ్ ఫ్రీగానే తీసుకురావొచ్చు. అంతకంటే ఎక్కువ గోల్డ్ తీసుకొస్తే కస్టమ్స్ సుంకం చెల్లించాలి. గరిష్ఠంగా కిలో వరకు గోల్డ్‌ను తెచ్చుకోవచ్చు. అయితే వాటి కొనుగోలు పత్రాలు సమర్పించాలి. ఈవిషయం తెలియక చాలామంది అమాయకులు కస్టమ్స్ అధికారులకు దొరికిపోతుంటారు. విదేశాల నుంచి తెచ్చే బంగారంపై విధించే కస్టమ్స్ ట్యాక్స్‌ను 6 శాతానికి భారత సర్కారు తగ్గించింది.