Site icon HashtagU Telugu

YouTuber Vs SEBI: రూ.104 కోట్లు సంపాదించిన యూట్యూబర్‌‌.. ‘సెబీ’ బ్యాన్

Asmita Patel Youtuber Asmita Patel Vs Sebi

YouTuber Vs SEBI: ప్రతీ ఒక్కరు రోజులో కనీసం ఒకటి, రెండుసార్లయినా తప్పకుండా చూసే  యాప్ ఏదైనా ఉందంటే.. అది యూట్యూబే. దీన్ని మంచికి వాడే వాళ్లు చాలామంది ఉన్నారు. చెడుకు వాడే వాళ్లు కూడా కొంతమంది ఉన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం చట్టవిరుద్ధం. ఇక మనం అసలు విషయంలోకి వెళ్దాం. అస్మితా జితేశ్ పటేల్ గురించి తెలుసుకుందాం. ఆమె ఒక ఫేమస్ యూట్యూబర్. అస్మిత  గురించి ఏకంగా భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’(YouTuber Vs SEBI) ఆలోచించాల్సి వచ్చింది. ఆమెతో సంబంధమున్న ఆరు సంస్థలపై బ్యాన్ విధించాల్సి వచ్చింది. ఇంతకీ ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక

అస్మితా పటేల్ ఏం చేసింది ? 

స్టాక్ మార్కెట్ సంబంధిత అంశాలపై మంచి కంటెంట్‌ను అందించే యూట్యూబర్లు చాలామందే ఉన్నారు.  అయితే అస్మితా పటేల్ అలాకాదు. ఆమె తన యూట్యూబ్ ఛానల్‌‌ను సెబీ నిబంధనలకు విరుద్ధంగా నడిపించింది. స్టాక్ మార్కెట్‌లోని ఆప్షన్స్ ట్రేడింగ్, షేర్ల ట్రేడింగ్‌పై ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించింది.  ఆప్షన్స్, షేర్లకు సంబంధించిన  కీలకమైన టిప్స్ ఇస్తానంటూ జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ‘షీ వుల్ఫ్’, ‘ఆప్షన్స్ క్వీన్’ తనను తాను ప్రచారం చేసుకుంది. జనాలకు టిప్స్ చెప్పి, దాదాపు రూ.104 కోట్లను అస్మిత సంపాదించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈవిషయం సెబీ కూడా గుర్తించి అస్మితపై రూ.53.67 కోట్ల జరిమానా విధించింది. ఈమేరకు ఫిబ్రవరి 6న సెబీ ఆదేశాలు జారీ చేసింది.  అస్మిత, ఆమె భర్త జితేశ్ జేథాలాల్ పటేల్ కలిసి 6 సంస్థలను నిర్వహించేవారు. వీటి నుంచే ప్రజలకు ఆప్షన్స్ ట్రేడింగ్, షేర్ల ట్రేడింగ్‌పై టిప్స్ వెళ్లేవి. వీటిపై ఔత్సాహికులకు అస్మిత, ఆమె భర్త ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు. ఇందుకోసం భారీగా ఫీజులు వసూలు చేసేవారు. వీరికి చెందిన ఆరు సంస్థలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా సెబీ బ్యాన్ విధించింది.

Also Read :Manipur CM Resignation: మణిపూర్‌లో సంచలన పరిణామం.. సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా

అస్మితా పటేల్ ఎవరు ?