Site icon HashtagU Telugu

Job Market: భార‌త‌దేశంలో ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్‌!

Job Market

Job Market

Job Market: భారతదేశంలో వైట్-కాలర్ ఉద్యోగాల మార్కెట్ (Job Market) ఆగస్ట్ 2025లో క్రమంగా బలోపేతం అవుతోంది. నౌకరీ.కామ్ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం.. ఈ నెలలో ఇండెక్స్ 2,664కి చేరుకుంది. ఇది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 3% వృద్ధిని సూచిస్తుంది. ఈ వృద్ధికి ప్రధానంగా ఐటీయేతర రంగాలు దోహదపడ్డాయి.

ఐటీయేతర రంగాల్లో అధిక వృద్ధి

బీమా రంగం: బీమా రంగంలో ఉద్యోగ నియామకాలు ఏకంగా 24% పెరిగాయి. కోల్‌కతాలో 36%, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 30% వృద్ధి నమోదైంది. ఈ రంగంలో మధ్యస్థ స్థాయి నిపుణులకు (4-7 సంవత్సరాల అనుభవం) 34% అధిక డిమాండ్ కనిపించింది. అలాగే ఫ్రెషర్స్ కోసం 25%, 8-12 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి 16% అవకాశాలు పెరిగాయి.

హాస్పిటాలిటీ & ట్రావెల్: ఈ రంగంలో కూడా 22% వార్షిక వృద్ధి నమోదైంది.

Also Read: Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు

ఐటీ రంగంలో కొత్త ధోరణులు

మొత్తంగా ఐటీ రంగంలో 6% తగ్గుదల ఉన్నప్పటికీ ఐటీ స్టార్టప్‌లు, యూనికార్న్‌లలో బలమైన వృద్ధి నమోదైంది. ఈ విషయంలో హైదరాబాద్ ముందంజలో ఉంది. హైదరాబాద్‌లో స్టార్టప్ నియామకాలు 30%, యూనికార్న్‌లలో 45% వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ఇది హైదరాబాద్ కొత్త టెక్నాలజీ, స్టార్టప్ నియామకాలకు కేంద్రంగా మారుతోందని సూచిస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) & మెషిన్ లెర్నింగ్ (ML): ఈ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 54% భారీ వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా కోల్‌కతాలో 101%, హైదరాబాద్‌లో 80%, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 72%, చెన్నైలో 67% వృద్ధి నమోదైంది. దీని ద్వారా టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ పెరుగుతోందని స్పష్టమవుతోంది.

నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ మాట్లాడుతూ.. ఆగస్టు గణాంకాలు భారత్ ఉద్యోగ మార్కెట్‌ను ఐటీయేతర రంగాలు నడిపిస్తున్నాయని సూచిస్తున్నాయి. హైదరాబాద్ స్టార్టప్‌లకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.