Bank Locker Rules : మనం ఏవైనా కీలకమైన వస్తువులను దాచుకోవడానికి బెస్ట్ ఆప్షన్ బ్యాంక్ లాకర్లు. చాలామంది వీటిలో ఆభరణాలను, ఆస్తి పత్రాలను, వీలునామాలను దాచుకుంటూ ఉంటారు. సేఫ్టీ ఉంటుందనే భరోసాతో బ్యాంక్ లాకర్లను చాలామంది ఆశ్రయిస్తుంటారు. అయితే ఎంతోమందికి బ్యాంక్ లాకర్‌లో ఉంచదగిన, ఉంచకూడని వస్తువుల వివరాలు తెలియవు. లాకర్‌లో పెట్టిన వస్తువులు పోతే ఏం చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఈ కథనంలో మనం ఆ సమాచారాన్ని తెలుసుకుందాం..
Also Read :Emojis Vs Marks : మార్కులకు గుడ్‌బై.. స్టార్లు, ఎమోజీలకు జైజై.. స్కూళ్లలో కొత్త ట్రెండ్
బ్యాంకు లాకర్లకు సంబంధించిన రూల్స్ బ్యాంకులను బట్టి మారుతుంటాయి. అయితే చాలావరకు అన్ని బ్యాంకుల రూల్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. తమ లాకర్‌లో ఏం దాచారనే విషయాన్ని బ్యాంకు అధికారులకు కస్టమర్లు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఒకవేళ చెబితే.. లాకర్ లోపల ఏముందో బ్యాంకు సిబ్బందికి తెలిసిపోతుంది. అసలు రూల్స్ ప్రకారమైతే.. లాకర్లోని వస్తువులకు బ్యాంకులు బాధ్యత వహించవు. లాకర్‌పై పూర్తి బాధ్యత దాన్ని లీజు తీసుకున్న వ్యక్తికే ఉంటుంది. కొన్ని బ్యాంకులు లాకర్‌లో నగదును ఉంచడానికి అనుమతి ఇవ్వవు. ఎందుకంటే క్యాష్‌కు ఇన్సూరెన్స్ ఉండదు. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ లాకర్లలో లీగల్ డాక్యుమెంట్లు, ఆభరణాలను దాచుకోవచ్చు. డబ్బులు మాత్రం పెట్టకూడదు. త్వరగా పాడయ్యే పదార్థాలు, రేడియో యాక్టివ్ వస్తువులు, డ్రగ్స్‌ను లాకర్‌లో ఉంచకూడదు. బ్యాంకు లాకర్లలో(Bank Locker Rules) బాండ్లు, షేర్ల సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ పాలసీల డాక్యుమెంట్లు, ఫైనాన్సియల్ రికార్డ్‌లు దాచుకోవచ్చు.
Also Read :World War 3 : ట్రంప్ అధ్యక్షుడు అయ్యేలోగా మూడో ప్రపంచ యుద్ధం.. బైడెన్ కుట్ర : జూనియర్ ట్రంప్
లాకర్లకు ప్రమాదం జరిగితే..
ఏదైనా ప్రమాదం వల్ల బ్యాంకు లాకర్లకు నష్టం సంభవిస్తే.. లాకర్ కోసం కట్టిన వార్షిక అద్దెపై 100 రెట్లు పరిహారం అందుతుంది. అంతే తప్ప లాకర్‌లో ఉన్న వస్తువుల మార్కెట్ ధర ప్రకారం పరిహారం రాదు. ఈ అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి.