Site icon HashtagU Telugu

Zudio Beauty : వస్తోంది ‘జూడియో బ్యూటీ’.. హెచ్‌యూఎల్, రిలయన్స్, నైకాలతో టాటా గ్రూప్ ఢీ

Noel Tata

Noel Tata

Zudio Beauty : రతన్​ టాటా వారసుడు, టాటా గ్రూపు ఛైర్మన్ నోయల్​ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హిందుస్తాన్ యూనీలీవర్​, నైకా, రిలయన్స్‌లను ఢీకొనే కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వస్త్ర వ్యాపారానికి పరిమితమైన ‘జూడియో’ను.. ఇక బ్యూటీ మార్కెట్‌లోకి తీసుకొస్తామని వెల్లడించారు. ‘జూడియో బ్యూటీ’ పేరు బ్యూటీ మార్కెట్లో సేవలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదటి జూడియో బ్యూటీ స్టోర్  ఉంది. త్వరలోనే గురుగ్రామ్​, పూణే, హైదరాబాద్‌లలోనూ ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నారు. టాటా గ్రూపు పరిధిలోని ‘ట్రెంట్’ కంపెనీని ఇన్నాళ్లూ స్వయంగా నోయల్ టాటా(Zudio Beauty) నడిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 550కిపైగా జూడియో స్టోర్స్​ ఉన్నాయి. ఇప్పుడు దానితో ‘జూడియో బ్యూటీ’ జతకట్టనుంది.

Also Read :High Court Jobs : తెలంగాణ హైకోర్టు‌లో లా క్లర్క్ జాబ్స్.. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక

హిందుస్తాన్ యూనీలీవర్​(హెచ్‌యూఎల్)కు చెందిన ఎల్18, షుగర్​ కాస్మోటిక్స్​, హెల్త్ అండ్ గ్లో, కలర్​బార్‌ల​తో జూడియో బ్యూటీ పోటీపడనుంది. లగ్జరీ బ్యూటీ ప్రొడక్ట్స్​ సెగ్మెంట్​లో రిలయన్స్, నైకా, షాపర్స్​ స్టాప్ వ్యాపారం చేస్తున్నాయి. అయితే వీటి ప్రోడక్ట్స్ చాలా ఖరీదైనవి. అందుకే సామాన్యులకు అందుబాటులో ఉండేలా జూడియో బ్యూటీని నోయల్ టాటా తీసుకొచ్చారు. వాస్తవానికి భారతదేశంలో మొదటి బ్యూటీ బ్రాండ్​ ‘లాక్మే’‌ను ప్రారంభించింది టాటా గ్రూపే​. కొంతకాలానికే దాన్ని హిందుస్తాన్ యూనిలివర్​కు విక్రయించింది. ‘క్లిక్ పాలెట్’ పేరుతో ప్రీమియం కాస్మోటిక్​ ప్లాట్​ఫామ్​ను టాటా గ్రూపు నడుపుతోంది.

ప్రస్తుతం మనదేశంలో మామా ఎర్త్​, నివియా, నైకా, లారియాల్ లాంటి బ్రాండ్​లు 33 శాతం మార్కెట్ షేర్​ను కలిగి ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో వీటి మార్కెట్​ షేర్​ 42 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. హిందుస్తాన్ ​ యూనిలివర్​, ప్రోక్టర్ అండ్ గాంబుల్​ మార్కెట్ షేర్​ 2027 నాటికి 58 శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో టాటా బ్యూటీ బ్రాండ్​ ఎంత మేర సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.