అమెరికా చైనా దిగుమతులపై (US imports from China) అధిక సుంకాలు విధించడం భారత బొమ్మల తయారీదారులకు (For Indian toy Manufacturers) అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. చైనా బొమ్మలపై ఆధారపడుతున్న యూఎస్ మార్కెట్ ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాలవైపు దృష్టి మళ్లించిందని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన బొమ్మల తయారీదారులు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో నిలబెట్టే అవకాశాన్ని వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే టాయ్ అసోసియేషన్ సుమారు 40 సంస్థలను గుర్తించింది, వీటిలో చాలా సంస్థలు ఎగుమతులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
Comments On KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మెదక్ ఎమ్మెల్యేపై కేసు!
టాయ్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ అగర్వాల్ తెలిపిన ప్రకారం.. గత నెలలోనే యూఎస్‌కు చెందిన బొమ్మల కొనుగోలుదారుల నుంచి ఎంక్వైరీలు వచ్చాయని తెలిపారు. అమెరికన్ ప్రమాణాలు, నిబంధనల ప్రకారం తయారీ సామర్థ్యం కలిగిన సంస్థల జాబితాను కోరుతూ పలువురు సంప్రదించారని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లోని 20 కంపెనీలు ఇప్పటికే అమెరికాకు బొమ్మలను పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నాయి. చైనా బదులుగా భారత్‌ను ఎంపిక చేసుకోవడంలో తక్కువ ధరలు, నాణ్యత గల ఉత్పత్తులే కీలకంగా మారుతున్నాయని ఆయన అన్నారు.
భారతదేశ బొమ్మల పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో 1 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉంది. కానీ ట్రంప్ విధించిన అధిక సుంకాలు భారతీయ సంస్థలకు బలమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పట్టుకోడానికి టాయ్ అసోసియేషన్ ప్రత్యేకంగా తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించనుంది. ప్రభుత్వ సహకారం సరైన ప్రోత్సాహం ఉంటే, భారత బొమ్మల పరిశ్రమ గ్లోబల్ మార్కెట్లో తమ ఉనికిని పెంచుకునే అవకాశముంది. అమెరికా వంటి అతిపెద్ద మార్కెట్‌లో మన ఉత్పత్తులు నిలబడితే, భారతదేశానికి భారీగా విదేశీ కరెన్సీ ప్రవాహం కలగనుంది.