కొద్దీ రోజులుగా బంగారం ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల పెరుగుదల అంచనాలు, పెట్టుబడిదారుల లాభాల వసూళ్లు వంటి అంశాలు ఈ ధరల పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫలితంగా, భారత్‌లో కూడా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పెళ్లి సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామం వినియోగదారులకు పెద్ద వరంగా మారింది. సాధారణంగా ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. బంగారం ధరలు తాత్కాలికంగా పడిపోవడం వల్ల పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునే కుటుంబాలు ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవచ్చు.
Good News : అంగన్‌వాడీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
గడచిన వారం రోజుల గణాంకాలను పరిశీలిస్తే, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 2,620 మేర తగ్గింది. అక్టోబర్ 26న రూ. 1,25,620గా ఉన్న పసిడి ధర, నవంబర్ 1నాటికి రూ. 1,23,000కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 2,400 మేర పతనం చెంది, రూ. 1,15,150 నుంచి రూ. 1,12,750కు దిగివచ్చింది. ఇది బంగారం మార్కెట్‌లో ఒక ముఖ్యమైన సవరణగా నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాక, అక్టోబర్ 17న బంగారం ధర రూ. 1,32,770 వద్ద ఉండగా, ఇప్పుడు దాదాపు రూ. 10,000 మేర పతనం కావడం వల్ల ఇది కొనుగోలుదారులకే లాభదాయకమని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ధరలు తగ్గినా, బంగారం కొనుగోలు సమయంలో కొన్ని అంశాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ రేటుతో పాటు జీఎస్‌టీ మరియు జువెలర్స్ వసూలు చేసే తయారీ చార్జీలు కూడా కలుపుకుంటే తుది ధర కొంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన లెక్కలు వేసుకొని, విశ్వసనీయమైన జువెలరీ షాపులలోనే కొనుగోలు చేయడం ఉత్తమం. నిపుణుల అంచనా ప్రకారం ఈ ధరల పతనం ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వం వచ్చిన వెంటనే బంగారం మళ్లీ పైకి ఎగసే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పుడు బంగారం కొనుగోలు చేయదలచిన వారికి ఇది నిజంగా ఒక సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు.
