PAN Card Linked Loans : పాన్‌కార్డు.. కీలకమైన డాక్యుమెంట్. బ్యాంకులు, ఫిన్ టెక్ కంపెనీలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందాలంటే దీన్ని సమర్పించడం తప్పనిసరి. పాన్ కార్డు పేరులోనే అసలు విషయమంతా దాగి ఉంది. పాన్ అంటే పర్మినెంట్ అకౌంటు నంబరు. మన శాశ్వత ఖాతా సంఖ్య అది. అందుకే మన ఆర్థిక వ్యవహారాలు చాలావరకు దానిలో యాడ్ అవుతుంటాయి. ప్రత్యేకించి మనం తీసుకునే రుణాల చిట్టా సైతం అందులో యాడ్ అవుతుంటుంది. దీనివల్ల పాన్ కార్డు ద్వారా(PAN Card Linked Loans) మన రుణాల సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ఈజీ. అదెలాగో ఈ కథనంలో చూద్దాం..
Also Read :MLA VenkataRamana Reddy : 45 రోజుల్లోగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
ఇవి తెలుసుకోండి..
- పాన్ కార్డుతో లింక్ అయి ఉన్న లోన్ల వివరాలను తెలుసుకునేందుకు మొదటి మార్గం క్రెడిట్ బ్యూరోలు.
- ‘సిబిల్’ అనేది ఒక క్రెడిట్ బ్యూరో సర్వీసుల సంస్థ. ఇలాంటి సంస్థలు చాలానే ఉంటాయి.
- మనం ఏదైనా ఒక క్రెడిట్ బ్యూరో సంస్థ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా మన పాన్ కార్డుతో లింక్ అయి ఉన్న రుణాల సమాచారాన్ని చూసుకోవచ్చు.
- మనం ఏదైనా ఫిన్‌టెక్ కంపెనీ యాప్ నుంచి లోన్ తీసుకున్నామనుకోండి. దానిలోకి లాగిన్ కావాలి.
- ఫిన్ టెక్ యాప్‌లో డాక్యుమెంట్లు, వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ప్రత్యేక సెక్షన్లు ఉంటాయి. వాటిలోకి వెళ్లి రుణం తీసుకునే క్రమంలో పాన్ కార్డును ఇచ్చామా లేదా అనేది తెలుసుకోవచ్చు.
- మనం ఏదైనా బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ నుంచి లోన్ తీసుకున్నామనుకోండి. నేరుగా దాని ఆఫీసుకు వెళ్లి, రుణం తీసుకునే సమయంలో పాన్ కార్డును ఇచ్చారా లేదా అనేది తెలుసుకోవచ్చు.
- సదరు బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీకి చెందిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా ఈ సమాచారాన్ని పొందొచ్చు.
- నేరుగా వాళ్ల కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కూడా మన లోన్‌తో పాన్ లింక్ అయి ఉందా లేదా అనేది అడిగి తెలుసుకోవచ్చు.