Gold Price: భారత మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. ఏ చిన్న ఫంక్షన్ అయినా బంగారం షాపుకే వెళ్తుంటారు. బంగారం ధర పెరగడం లేదా తగ్గడం వల్ల మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం ఉంటుంది. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ కూడా బంగారం ధర పెరుగుతుందని సూచించారు. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు (Gold Price) చేరుకోవచ్చని ఆయన సూచించారు. భారతదేశంలో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, దానిని కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారని మాజీ ఆర్థిక కార్యదర్శి అంటున్నారు. బంగారం ధరలను మూడు ప్రధాన అంశాలు నిర్ణయిస్తాయని ఆయన తెలియజేశారు.
బంగారం ధరను నిర్ణయించే అంశాలు
- డాలర్లలో బంగారం అంతర్జాతీయ ధర
- ప్రభుత్వం విధించిన కస్టమ్స్ సుంకం
- నగల వ్యాపారులు, ఇతర మధ్యవర్తులచే లాభాల మార్జిన్
Also Read: Trisha Gongadi: టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి రికార్డు.. 53 బంతుల్లోనే సెంచరీ!
బడ్జెట్ 2025 తర్వాత బంగారం ధర పెరిగే ఛాన్స్?
జులైలో కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం బంగారంపై మొత్తం కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. బడ్జెట్ 2025లో ప్రభుత్వం మళ్లీ మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 10%, 14% లేదా 15%కి పెంచితే బంగారం ధరలు పెరగవచ్చని అన్నారు. కస్టమ్ డ్యూటీ పెరుగుదలతో వాణిజ్యం, పరిశ్రమల ద్వారా వినియోగదారులకు బంగారం రేటు పెరుగుతుంది.
10 గ్రాముల బంగారం రూ. 1 లక్ష వరకు ఉంటుంది
ఇది కాకుండా సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుత.. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణయిస్తారు. కేవలం కస్టమ్ డ్యూటీ మాత్రమే కాదు. ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచితే బంగారం ధరలో పెరుగుదల ఉండవచ్చు. బడ్జెట్ 2025 తర్వాత 10 గ్రాముల బంగారం ధర రూ. 1 లక్ష కావచ్చు. కస్టమ్ డ్యూటీలో మార్పు లేకపోతే బంగారం ధర 6 నెలల నుండి 1 సంవత్సరం తర్వాత పెరిగే అవకాశం ఉంది అని ఆయన స్పష్టం చేశారు.