Site icon HashtagU Telugu

Musk Party : మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్.. పడిపోయిన టెస్లా షేర్లు

Musk Shares Down

Musk Shares Down

ప్రముఖ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Musk ) అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ప్రతికూల స్పందన కనిపించింది. ముఖ్యంగా టెస్లా షేర్లపై ఈ వార్త తీవ్ర ప్రభావం చూపింది. ప్రీమార్కెట్‌లో టెస్లా షేర్లు ఏకంగా 7% తగ్గిపోయాయి. గత వారం $315.35 వద్ద ముగిసిన టెస్లా షేరు ధర తాజాగా $291.96కి పడిపోయింది. మస్క్ రాజకీయ రంగ ప్రవేశంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు

ఇన్వెస్టర్ల ఆందోళనకు ప్రధాన కారణం మస్క్ ఫోకస్ టెస్లాపై కాకుండా రాజకీయాల్లోకి మళ్లిపోవచ్చన్న అనుమానం. ఇప్పటికే టెస్లా స్వల్ప వృద్ధితో కొనసాగుతుండగా, ఇప్పుడు సీఈఓ మస్క్ దృష్టి ఇతర విషయాలవైపు తిరగడం కంపెనీ భవిష్యత్తుపై ప్రశ్నార్ధకంగా మారింది. మస్క్ సర్వీసులపై అత్యధికంగా ఆధారపడే టెస్లా కంపెనీకి ఇది షాక్ లాంటిదే. దీంతో స్టాక్ మార్కెట్‌లో టెస్లా షేర్లు అమ్మకానికి వెల్లువెత్తాయి. ఇది యాజమాన్యంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం కొరతకు సంకేతంగా చూడవచ్చు.

అయితే గత ఐదేళ్లలో టెస్లా షేర్లు 206%కు పైగా లాభాలు ఇచ్చినట్లు గమనించాలి. దీని వలన కొంతమంది దీర్ఘకాల పెట్టుబడిదారులు ఇప్పటికీ కంపెనీపై నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మస్క్ రాజకీయాల్లో ఎంత మేరగా నిమగ్నమవుతారు, ఆయన ఆ వ్యవస్థపై చూపే ఆసక్తి టెస్లా కార్యకలాపాలపై ఎంత ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. రాబోయే రోజుల్లో మస్క్ నిర్ణయాలు టెస్లా షేరు ధరను ఏ దిశగా నడిపిస్తాయో వేచి చూడాల్సిందే.

Exit mobile version