Site icon HashtagU Telugu

AC on Rent : సమ్మర్ నీడ్.. ఏసీ కొనలేరా.. రెంటుకు తీసుకోండి !

Ac On Rent

Ac On Rent

AC on Rent : ఈ సమ్మర్ సీజన్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఫ్యాను గాలి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈనేపథ్యంలో కొంతమంది ఏసీ కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.  అయితే కొందరు ఆ దిశగా సాహసం చేయలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొత్త ఏసీ కొనే దిశగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికి ఏసీని వాడుకునేందుకు ఓ అవకాశం ఉంది. అదే ‘ఏసీ ఆన్ రెంట్’ (AC on Rent). 

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి పలు ప్రధాన నగరాల్లో ఏసీ ఆన్ రెంట్ సౌకర్యాన్ని చాలా సంస్థలు అందిస్తున్నాయి. చాలా తక్కువ నెలవారీ ఛార్జీకే ఏసీని రెంటుకు ఇస్తున్నాయి. నెలకు సగటున రూ.800 నుంచి రూ.1500 దాకా ఏసీ రెంటును తీసుకుంటున్నారు. ఇలా అద్దెకు తీసుకున్న ఏసీలో ఏదైనా అంతరాయం ఏర్పడితే నేరుగా సర్వీస్ సెంటరుకు కాల్ చేస్తే, వాళ్లే వచ్చి సర్వీసింగ్ కూడా చేస్తారు. అద్దెకు తీసుకునే వారు ఏసీ  రేంజును బట్టి ఇన్‌స్టాలేషన్ ఛార్జీ, రిఫండబుల్ డిపాజిట్ కట్టాలి. వీటిలో పైపుల ఖర్చులు వంటివి అదనంగా ఉంటాయి.

Also Read :Technical Graduates : ప్రతినెలా లక్ష శాలరీ.. ఆర్మీలో జాబ్స్..

రెంట్‌మోజో, ఫెయిరెంట్, సిటీఫర్నీష్, రెంట్‌లోకో వంటి సంస్థలు మనదేశంలోని  అనేక మెట్రో నగరాల్లో ఏసీలను అద్దెకు ఇస్తున్నాయి. ఏసీ కెపాసిటీని బట్టి ఇవి రెంటును వసూలు చేస్తాయి. విండోస్, స్ప్లిట్ ఏసీ సిస్టమ్స్ రెండూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ  వెబ్‌సైట్లలో ఏవి తక్కువ రేటు.. మంచి కెపాసిటీ కలిగిన ఏసీలను అద్దెకు ఇస్తున్నాయి అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. ఏసీని మనం ఇంట్లో ఫిట్ చేయించుకున్నాక ఒకవేళ  పనిచేయకుంటే.. వెంటనే వచ్చి రిపేరింగ్ చేసి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చే ఏజెన్సీ నుంచే ఏసీని రెంటుకు తీసుకోండి. బాధ్యతాయుతంగా సర్వీసు అందించే ఏజెన్సీని ఎంచుకుంటే ఎలాంటి రిస్కూ ఉండదు. ఒకేసారి రూ.30వేల దాకా ఖర్చుపెట్టి ఏసీని కొనలేని వారికి ఏసీ ఆన్ రెంటు సౌకర్యం ఎండాకాలంలో ఓవరం లాంటిది. దీన్ని వాడుకొని సమ్మర్ టైంను మనం ఈజీగా గట్టెక్కొచ్చు.

Exit mobile version