Starbucks CEO : పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు తమ సీఈఓలకు పెద్ద రేంజులో శాలరీలు ఇస్తుంటాయి. అంతకుమించిన రేంజులో అదనపు సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఈవిషయంలో స్టార్ బక్స్ కంపెనీ చాలా కంపెనీలను మించిపోయింది. తమ కంపెనీకి కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ నికోల్‌కు(Starbucks CEO) కంపెనీ ప్రత్యేకమైన కార్పొరేట్ జెట్‌ను సమకూర్చింది. దానిలో ఆయన ఇంటి నుంచి రోజూ దాదాపు 1600 కిలోమీటర్లు ప్రత్యేక విమానంలో ప్రయాణించి ఆఫీసుకు వెళ్లనున్నారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
బ్రియాన్ నికోల్ ఇలా ఎందుకు జర్నీ చేస్తున్నారు ? ఆఫీసు ఉన్న దగ్గరే ఉండొచ్చు కదా ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. అయితే స్టార్ బక్స్ కంపెనీ సీఈవో పోస్టులోకి చేరే ముందే తనకు ప్రైవేటు జెట్ అందించాలనే షరతును బ్రియాన్ నికోల్ పెట్టారు. దానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. తాను జాబ్ కోసం ఇంటిని మారలేనని, ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్న తన ఇంటి నుంచే సియాటెల్‌లో ఉన్న స్టార్ బక్స్ హెడ్ ఆఫీసుకు అప్ అండ్ డౌన్ చేస్తానని బ్రియాన్ నికోల్ తేల్చి చెప్పారు. ఈ షరతును అంగీకరించినందు వల్లే కంపెనీ యాజమాన్యం ఆయనకు కార్పొరేట్ జెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు వర్కింగ్ డేస్‌లో నికోల్ కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచి సియాటెల్‌లోని స్టార్‌బక్స్ ప్రధాన కార్యాలయానికి విమానంలో వెళ్తున్నారు. వారంలో మూడు రోజుల పాటు ఆయన ఇలా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
Also Read :Red Light Area : రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వచ్చాక.. వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారం
బ్రియాన్ నికోల్ వార్షిక వేతనం రూ.13.41 కోట్లు. ఆయనకు ప్రతి సంవత్సరం నగదు బోనస్‌గా రూ.60 కోట్ల దాకా ఇస్తారు. ఇక వార్షిక రివార్డు కింద ఏటా రూ.192 కోట్లు విలువైన కంపెనీ వాటాలు ఇస్తారు. ఇక కార్పొరేట్ జెట్ ద్వారా ప్రయాణం సౌకర్యం ఉండనే ఉంటుంది. 2018లో చిపోటిల్ అనే కంపెనీలో బ్రియాన్ నికోల్ పనిచేసేవారు. అప్పట్లో ఆ సంస్థ కూడా ప్రైవేట్ జెట్ సౌకర్యాన్ని ఆయనకు కల్పించేది.