Credit Cards : విద్యార్థులకూ క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు.. అప్లై చేయడం ఈజీ

18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు స్టూడెంట్ క్రెడిట్ కార్డు(Credit Cards) కోసం బ్యాంకుకు అప్లై చేయొచ్చు.

Published By: HashtagU Telugu Desk
Credit Cards For Students Student Credit Cards

Credit Cards : విద్యార్థులు కూడా క్రెడిట్ కార్డులను పొందొచ్చు. ఈవిషయం చాలా మందికి తెలియదు. కేవలం సంపాదనపరులకే క్రెడిట్ కార్డులు ఇస్తారనే భావన ఎంతోమందికి ఉంటుంది. ఆ అపోహలు తొలగాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Gold is Gold : గోల్డ్ ఈజ్ గోల్డ్.. ఏటా 8 శాతం రిటర్నులు.. పెట్టుబడిగా బెస్ట్

స్టూడెంట్ క్రెడిట్ కార్డుల విశేషాలు

  • 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు స్టూడెంట్ క్రెడిట్ కార్డు(Credit Cards) కోసం బ్యాంకుకు అప్లై చేయొచ్చు.
  • ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీలో చదివే వారు మాత్రమే దీనికి అర్హులు.
  • హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి బ్యాంకులు ఈ కార్డులను జారీ చేస్తున్నాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫారెక్స్ ప్లస్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐఎస్‌ఐసీ స్టూడెంట్ ఫారెక్స్ ప్లస్ చిప్ కార్డ్‌లను విద్యార్థులు పొందొచ్చు. వీటికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు.
  • ఐడీఎఫ్‌సీ వావ్ క్రెడిట్ కార్డ్‌ను స్టూడెంట్స్ తీసుకోవచ్చు. దీనికి కూడా ఎలాంటి వార్షిక ఫీజు లేదు.
  • ఐసీఐసీఐ బ్యాంక్ స్టూడెంట్ ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్‌ను విద్యార్థులు పొందొచ్చు. దీనికి వార్షిక ఫీజు రూ.499.
  • ఒకవేళ ఏవైనా బ్యాంకులు క్రెడిట్ కార్డును ఇవ్వకుంటే..  కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేసి క్రెడిట్ కార్డును పొందొచ్చు. మనం డిపాజిట్ చేసిన డబ్బుకు సమానంగా క్రెడిట్ లిమిట్‌ ఇస్తారు.
  • ఫ్యామిలీలో ఎవరికైనా ఇప్పటికే క్రెడిట్ కార్డు ఉంటే, వారి కార్డుకు అనుబంధంగా యాడ్-ఆన్ క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు.

Also Read :Donald Trump : ట్రంప్ తగ్గేదే లే.. కోట్లు ఖర్చుపెట్టి తరిమేస్తున్నాడు.. 205 మంది భారతీయులు బ్యాక్

  • విద్యార్థులు క్రెడిట్ కార్డుకు అప్లై చేసే క్రమంలో తప్పకుండా పాన్ కార్డ్, ఆధార్ కార్డులను సమర్పించాలి.
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను కూడా దరఖాస్తుతో పాటు ఇవ్వాలి.
  • యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి పొందిన అధికారిక ఐడీ కార్డును కూడా సబ్మిట్ చేయాలి.
  • ఇవన్నీ పరిశీలించి, మంచి క్రెడిట్ స్కోరు ఉంటే తప్పకుండా క్రెడిట్ కార్డును బ్యాంకులు మంజూరు చేస్తాయి.
  • స్టూడెంట్ క్రెడిట్ కార్డులో తొలుత క్రెడిట్ లిమిట్ తక్కువగా ఇస్తారు. దాన్ని సక్రమంగా వాడుకొని, సకాలంలో చెల్లింపులు చేస్తుంటే క్రెడిట్ లిమిట్‌ను పెంచుతారు.
  Last Updated: 04 Feb 2025, 11:44 AM IST