Site icon HashtagU Telugu

Food Packets : ఫుడ్ ప్యాకెట్లపై పోషకాల సమాచారం పెద్ద అక్షరాల్లో..

Food Packets Bolder Info

Food Packets : ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్‌ విషయంలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఫుడ్ ప్రోడక్ట్ ప్యాకెట్ వెనుక వాటిలోని పోషకాల సమాచారంతో కూడిన లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో  ఫుడ్ ప్రోడక్ట్‌లోని ఉప్పు, చక్కెర, శాచురేటెడ్‌ కొవ్వు, ఇతర పదార్థాల సమాచారం వరుసగా ఒకదాని కింద మరొకటి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సమాచారం చాలా చిన్న అక్షరాల్లో ఉంటోంది. వినియోగదారులకు ఈ ఇన్ఫో స్పష్టంగా కనిపించాలంటే.. పెద్ద అక్షరాల్లో, బోల్డ్ ఫాంట్‌లో పోషకాలు, ఇంగ్రేడియంట్స్ సమాచారాన్ని  ముద్రించాలనే నూతన మార్గదర్శకానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజాగా ఆమోదం  తెలిపింది. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేయనుంది.  ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్‌ను తయారు చేసే కంపెనీల నుంచి స్పందన తెలుసుకున్న తర్వాత ఈ మార్గదర్శకం అమలుకు తుది ఆదేశాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ జారీ చేయనుంది. ఆ తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్‌పై(Food Packets)  పోషకాల సమాచారాన్ని పెద్ద అక్షరాల్లో, లావు ఫాంటులో(Bolder Info)  ప్రింట్ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

చక్కెర, ఉప్పు అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈవిషయం తాజాగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) అధ్యయనంలో వెల్లడైంది.  ఈనేపథ్యంలో మన దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ఎన్‌ఐఎన్‌ కొత్త డైట్ ప్లాన్‌ను రిలీజ్ చేసింది. ఎన్‌ఐఎన్ డైట్ ప్లాన్‌ను రిలీజ్ చేయడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీని ప్రకారం ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ తినడం బాగా తగ్గించేయాలి. మానేస్తే ఇంకా బెటర్. జీవనశైలిని మార్చుకోవాలి. వ్యాయామానికి రోజూ కొంత టైం కేటాయించాలి.

Also Read :July Rainfall : జులై‌లో తెలంగాణకు వర్షపాత సూచన.. ఐఎండీ అంచనాలివీ

మన దేశ ప్రజలకు వస్తున్న జబ్బుల్లో 56.4 శాతం జబ్బులకు కారణం అనారోగ్యకర ఆహారమే అని ఎన్ఐఎన్ తెలిపింది. శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లు రెండూ పాటిస్తే గుండె జబ్బులు, షుగర్ ముప్పును తగ్గించుకోవచ్చని పేర్కొంది. వంటల్లో నూనెల వినియోగాన్ని తగ్గించాలని ఎన్‌ఐఎన్ కీలక సూచన చేసింది. నట్స్‌, సీఫుడ్‌ తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్‌ను పొందొచ్చని తెలిపింది.

Also Read :Ola Maps: గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పిన ఓలా.. ఇక‌పై ఓలా మ్యాప్స్‌పైనే రైడింగ్..!