ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ట్రెండ్ వైరల్‌గా మారింది — కంపెనీలు తమ కస్టమర్లకు బహిరంగంగా “క్షమాపణలు” చెబుతున్నాయి. సాధారణంగా కంపెనీలు ఏదైనా తప్పు జరిగితే, సేవల్లో లోపం ఉంటే లేదా ఉత్పత్తుల నాణ్యతపై విమర్శలు వస్తే క్షమాపణలు చెబుతాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ తప్పూ చేయకుండానే, కంపెనీలు సరదాగా ట్వీట్లు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కొత్త సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రెండ్ వ్యాపార ప్రపంచంలో చర్చనీయాంశమైంది.
Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత
ఈ క్షమాపణల ట్రెండ్‌లో ముఖ్యంగా రిలయన్స్, స్కోడా, ఫోక్స్‌వాగన్ వంటి ప్రముఖ బ్రాండ్లు పాల్గొన్నాయి. ఉదాహరణకు, రిలయన్స్ తన ట్వీట్‌లో “నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు అందిస్తున్నందుకు మేము క్షమాపణలు చెబుతున్నాం” అంటూ చెప్పింది. ఇదే సమయంలో స్కోడా మరియు ఫోక్స్‌వాగన్ తమ సోషల్ మీడియా పోస్టుల్లో “మా వాహనాల్లో సేఫ్టీకి కాంప్రమైజ్ చేయకపోవడం వల్ల క్షమించండి” అని హాస్యాత్మకంగా ట్వీట్ చేశాయి. ఈ పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో ప్రజలు సరదాగా స్పందిస్తూ, “ఇలా క్షమాపణలు చెప్పే కంపెనీలే కావాలి” అని కామెంట్లు చేస్తున్నారు.
IND Beat PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియాదే విజయం!
నిపుణుల ప్రకారం, ఇది సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ పెంచడానికి ఉపయోగపడే కొత్త తరహా మార్కెటింగ్ వ్యూహం. గతంలో బ్రాండ్లు కస్టమర్లతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయగా, ఇప్పుడు వారు సరదా హాస్యం ద్వారా కస్టమర్లను తమవైపు తిప్పుకుంటున్నారు. ఈ రకమైన పోస్టులు బ్రాండ్ ఇమేజ్‌ను సానుకూలంగా మార్చడమే కాకుండా, యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి. మొత్తానికి, “క్షమాపణల ట్రెండ్” అనే ఈ కొత్త మార్కెటింగ్ పంథా కంపెనీలకు పబ్లిసిటీతో పాటు, ప్రజలలో మంచి అభిప్రాయం సంపాదించే కొత్త మార్గాన్ని తెరిచింది.
