సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశపడుతున్నవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL) శుభవార్త చెప్పింది. భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అనుబంధంగా పనిచేస్తున్న LIC HFL, తాజాగా గృహ రుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్టు ప్రకటించింది. దీని వల్ల హోమ్ లోన్ వడ్డీ రేటు 7.50 శాతంతో ప్రారంభం అవుతుంది. ఈ తగ్గింపు తక్షణం అమలులోకి వచ్చినట్టు సంస్థ పేర్కొంది.
ఈ నిర్ణయం LIC HFL 36వ స్థాపన దినోత్సవం సందర్భంగా తీసుకున్నదని మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ త్రిభువన్ అధికారి తెలిపారు. తక్కువ వడ్డీకే రుణం లభించటంతో మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజలు సులభంగా ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందువల్ల వారిలో సొంతింటి కలను నెరవేర్చుకునే ఆకాంక్ష మరింత బలపడనుంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే LIC HFL తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నదని సంస్థ వర్గాలు వెల్లడించాయి.
Earthquake : ఉత్తర ఇరాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం
ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా మూడు ద్రవ్య పరపతి సమీక్షలలో రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపో రేటు 5.50 శాతానికి చేరింది. దీనివల్ల బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు తమ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంలో పాలుపంచుకుంటున్నాయి. LIC HFL తీసుకున్న ఈ నిర్ణయం గృహ రుణాలు తీసుకునే వారి వద్ద ఖర్చును గణనీయంగా తగ్గించి, ఆర్థిక భారం తక్కువ చేయనుంది.