Adani Shares Crash : ‘అదానీ’ షేర్లు ఢమాల్.. అప్పులిచ్చిన బ్యాంకుల షేర్లూ డౌన్

అదానీ ఎంటర్ ప్రైజెస్(Adani Shares Crash) షేరు ధర ఏకంగా 21.07 శాతం తగ్గింది.

Published By: HashtagU Telugu Desk
Adani Group Stocks

Adani Group Stocks

Adani Shares Crash : భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, బిలియనీర్ గౌతం అదానీ మళ్లీ కష్టాల్లో  పడ్డారు. అమెరికాలో ఆయనపై కేసులు నమోదైనట్లు, అరెస్టు వారెంట్ జారీ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి సోలార్ పవర్ కాంట్రాక్టులను పొందేందుకు గౌతం అదానీ, సాగర్ అదానీలు కొందరు అధికారులకు ముడుపులను ముట్టజెప్పారనే అభియోగాలను ఆయా కేసుల్లో ప్రస్తావించారు. తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా అమెరికా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను అదానీ గ్రూపు కంపెనీలు సేకరించాయనే అభియోగాన్ని సైతం నమోదు చేశారు.

Also Read :Meeto Mee Chandrababu : సంక్రాంతి నుంచి ‘మీతో మీ చంద్రబాబు’.. మోడీ ‘మన్‌ కీ బాత్’ తరహాలో కార్యక్రమం

స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు

  • ఈనేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూపులోని పలు కంపెనీల షేర్లు ఢమాల్ అయ్యాయి.
  • అదానీ ఎంటర్ ప్రైజెస్(Adani Shares Crash) షేరు ధర ఏకంగా 21.07 శాతం తగ్గింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు ధర 20 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర 17.51 శాతం డౌన్ అయింది.
  • అదానీ పవర్ 12.13 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 13.75 శాతం,  అదానీ పోర్ట్స్ 19.17 శాతం మేర తగ్గాయి.
  • అదానీ షేర్ల ధరలు పడిపోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 51ె8 పాయింట్లు తగ్గిపోయి 77,060 పాయింట్లకు చేరింది.
  • అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండటంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 182 పాయింట్ల మేర తగ్గిపోయి 23,335 పాయింట్లకు చేరింది.

Also Read :BPCL Oil Refinery: ఏపీలో రూ.60వేల కోట్లతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ

  • అదానీ గ్రూపునకు చాలా భారత ప్రభుత్వ బ్యాంకులు భారీగా అప్పులు ఇచ్చాయి. అమెరికాలో అదానీ గ్రూపుపై కేసులు నమోదవడం అనేది రానున్న రోజుల్లో ప్రతికూల ఫలితాలను ఇస్తుందని ఆయా బ్యాంకుల స్టాక్స్  కొన్న ఇన్వెస్టర్లు భావించారు. వారంతా ఆయా ప్రభుత్వ బ్యాంకుల షేర్లన అమ్ముకున్నారు. ఈ అమ్మకాల ఒత్తిడితో ఆయా ప్రభుత్వ బ్యాంకుల షేర్లు కూడా డౌన్ అయ్యాయి.
  • ఎస్‌బీఐ షేరు ధర 3.65 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు షేరు ధర 4.34 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు దర 4.24 శాతం, కెనరా బ్యాంకు 3.99 శాతం, యూనియన్ బ్యాంకు షేరు ధర 2.25 శాతం మేర తగ్గాయి. ఐఆర్ఈడీఏ షేరు ధర 2.37 శాతం, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేరు ధర 4.46 శాతం, ఆర్‌ఈసీ షేరు ధర 4.47 శాతం  మేర తగ్గాయి.
  • అదానీ గ్రూపునకు దాదాపు రూ.2.41 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అంచనా.
  • అమెరికాలో కేసులు నమోదైన నేపథ్యంలో గురువారం రోజు (ఇవాళ) అదానీ గ్రూపు  దాదాపు రూ.5వేల కోట్లు విలువైన బాండ్ల జారీ ప్రక్రియను నిలిపివేసింది. ఈ విషయాన్ని గురువారం స్టాక్‌ మార్కెట్‌కు తెలియజేసింది.
  Last Updated: 21 Nov 2024, 01:02 PM IST