సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకం (Sovereign Gold Bond Scheme) పెట్టుబడిదారులకు నిజమైన బంగారు పంటను అందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2020-21 సిరీస్-I కింద విడుదలైన గోల్డ్ బాండ్ల ముందస్తు ఉపసంహరణ ధరను గ్రాముకు రూ. 9,600గా నిర్ణయించింది. ఈ ఉపసంహరణ ఏప్రిల్ 28, 2025న జరగనుంది. ఐదు సంవత్సరాల క్రితం గ్రాముకు రూ. 4,589 ధరకే విడుదలైన ఈ బాండ్లు ఇప్పుడు రెట్టింపు కన్నా ఎక్కువ విలువను సాధించాయి. ఇది బాండ్ల పెట్టుబడిదారులకు రాబడిని అందించడంలో ఈ పథకం ఎంతో మేలు చేసింది.
Bilawal Bhutto: నీళ్లివ్వకుంటే.. సింధూనదిలో రక్తం పారిస్తాం : బిలావల్
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం అనేది భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా ఉండే ఒక ప్రభుత్వ సెక్యూరిటీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం తరపున ఈ బాండ్లు జారీ చేస్తారు. పెట్టుబడిదారులు కనీసం ఒక గ్రాము నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీలు మరియు ఆన్‌లైన్ వేదికల ద్వారా వీటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. బాండ్లు మార్కెట్ విలువ ఆధారంగా పూర్ణమైన రిటర్న్ ఇవ్వడమే కాక, సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా చెల్లిస్తాయి. వడ్డీని ఆరు నెలలకు ఒకసారి చెల్లించడం వల్ల పెట్టుబడిదారులకు స్థిర ఆదాయం లభిస్తుంది.
2020-21 సిరీస్-I బాండ్లను గ్రాముకు రూ. 4,589 ధరతో కొనుగోలు చేసిన వారు ఇప్పుడు గ్రాముకు రూ. 9,600గా ఉపసంహరణ పొందనున్నారు. లెక్క ప్రకారం.. రూ. 1 లక్ష పెట్టుబడితో దాదాపు 21.79 యూనిట్ల బాండ్లు వచ్చాయి. ఇప్పుడు వారి పెట్టుబడి విలువ రూ. 2,09,184కి పెరిగింది. ఇది సుమారు 109 శాతం రాబడిని సూచిస్తుంది. దీనితో పాటు ప్రతి ఏడాది 2.5 శాతం వడ్డీ ఆదాయం కూడా కలుపుకుంటే, మొత్తం రాబడి మరింత పెరుగుతుంది. భౌతిక బంగారంతో వచ్చే భద్రతా సమస్యలు లేకుండా సురక్షితంగా ఆదాయం ఇవ్వడం ఈ పథకాన్ని పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చింది.