గత కొన్ని రోజులుగా నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు (Gold Price), ఈరోజు తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. దసరా పండుగ సీజన్‌లో ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులలో ఆనందాన్ని రేపుతోంది. బులియన్ మార్కెట్‌లో నిపుణులు ప్రకారం.. ఈ నెలాఖరు వరకు ధరలు ఇంకా మరింతగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పుడే బంగారం కొనుగోలులో తొందరపడకుండా, కొంతకాలం ఆగి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం
10 గ్రాముల బంగారం ధర రూ.95,000కి దిగువకు వచ్చినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.93 తగ్గి రూ.11,444 వద్ద ట్రేడవుతోంది. 100 గ్రాముల ధర రూ.11,44,400గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.10,490 కాగా, 100 గ్రాముల ధర రూ.10,49,000. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,583 ఉండగా, 100 గ్రాములు రూ.8,58,000కి లభిస్తోంది. ఈ తగ్గుదల పసిడి మార్కెట్లో కొంత ఊరటనిస్తూనే, భవిష్యత్‌లో ఇంకా తగ్గే అవకాశాలను సూచిస్తోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కూడా కొంతవరకు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440గా, 22 క్యారెట్లు రూ.1,04,900గా, 18 క్యారెట్లు రూ.85,830గా ఉన్నాయి. చెన్నైలో మాత్రం కొద్దిగా భిన్నంగా, 24 క్యారెట్లు రూ.1,14,460, 22 క్యారెట్లు రూ.1,05,100, 18 క్యారెట్లు రూ.87,000గా ఉన్నాయి. మొత్తం మీద పండుగ సీజన్‌లో బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలు ఆసక్తి పెరిగే అవకాశం ఉన్నా, నిపుణుల సూచన మేరకు సరైన సమయంలో కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు మరింత లాభం పొందవచ్చు.